తేనెబంక తెగులు
తేనెబంక తెగులును ఏర్గాట్ తెగులు అని కూడా అంటారు.ఈ తెగులు ఎక్కువగా జొన్న, సజ్జ పంటలను ఆశిస్తాయి.[1]
లక్షణాలు
[మార్చు]సజ్జ వంటి పంటలలో, పుష్పించే దశలో అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులలో ఈ శిలీంద్రము కంకిలోని పుష్పాలను ఆశించి అండాశయం పై వృద్ధి చెందుతుంది.[2] వ్యాధి సోకిన గింజల నుండి తెల్లని లేక లేత ఎరుపు రంగు జిగట లాంటి తీయటి ద్రవం చుక్కలు చుక్కలుగా బయటికి వస్తుంది . దీనిలో శిలీంద్రబీజాలు ఉంటాయి . దీని తర్వాత వ్యాధి సోకిన గింజల్లో నల్లటి స్క్లిరోషియాలు ఏర్పడును. దీనిని ఎర్గాట్ దశ అని అంటారు.
వ్యాప్తి
[మార్చు]ఈ వ్యాధి పంట పొలాలలో కీటకాల ద్వారా, వర్షపు ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందును.
యాజమాన్య పద్ధతులు
[మార్చు]1.తెగులు సోకని పొలము నుండి విత్తనాలు సేకరించాలి.
2.వేసవిలో లోటు దుక్కులు చేయాలి
3.పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి.
నివారణ
[మార్చు]సేంద్రియ నివారణ
[మార్చు]1.పేడ మూత్ర ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
2.గోబాణం ద్రావణాన్ని పిచికారి చేయాలి.[3]
మూలాలు
[మార్చు]- ↑ ergot Archived 2016-03-03 at the Wayback Machine, online medical dictionary
- ↑ ergot Archived సెప్టెంబరు 10, 2009 at the Wayback Machine, Dorland's Medical Dictionary
- ↑ వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.