Jump to content

తొర్రూర్ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°17′09″N 78°38′44″E / 17.2857591°N 78.6455475°E / 17.2857591; 78.6455475
వికీపీడియా నుండి
(తొర్రూర్ (హయాత్‌నగర్‌) నుండి దారిమార్పు చెందింది)

తొర్రూర్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[2]

తొర్రూర్
—  రెవిన్యూ గ్రామం  —
తొర్రూర్ is located in తెలంగాణ
తొర్రూర్
తొర్రూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°17′09″N 78°38′44″E / 17.2857591°N 78.6455475°E / 17.2857591; 78.6455475
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
జనాభా (2011)
 - మొత్తం 4,912
 - పురుషుల సంఖ్య 2,522
 - స్త్రీల సంఖ్య 2,390
 - గృహాల సంఖ్య 1,033
పిన్ కోడ్ 501 511
ఎస్.టి.డి కోడ్ 08415

గ్రామ నామ విశేషం

[మార్చు]

ఈ గ్రామనామం పశుసంబంధమైనది. తొర్రూరు అన్న పేరు బాగా ప్రాచీనమైనదని పరిశోధకులు తేల్చారు. కొత్తరాతియుగం, బృహత్‌శిలా యుగానికి చెందిన ప్రాక్తన చారిత్రిక దశ నాటి పేరుగా గుర్తించారు. కొత్త రాతియుగంలో పశుపాలన, వ్యవసాయం విస్తృతిపొంది, రాగి, ఇనుము వాడకం, లోహపరిశ్రమ అవతరించింది. ఈ అంశాలను సూచిస్తూ ఏర్పడిన గ్రామనామాల్లో తొర్రూరు ఒకటి.[3]. ఈ గ్రామములో ప్రధాన భాష తెలుగు.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం. 4912, పురుషులు. 2522, స్త్రీలు 2390, నివాస గృహాలు 1033, విస్తీర్ణము. 974 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు.

రవాణా సౌకర్యములు

[మార్చు]

ఈ గ్రామానికి ఎల్.బి.నగర్ 10 కి.లో మీటర్ల దూరములో ఉంది. ఇక్కడికి, పరిసర ప్రాంతాలకు మంచి రహదారి వ్వవస్త కలిగి యుండి, ఆర్.టి.సి బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. లోపు రైలు వసతి లేదు. కాని ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది. అక్కడి నుండి దేశములోని పలు ప్రాంతాలకు రైలు వసతి ఉంది.

పాఠశాలలు

[మార్చు]

ఈ గ్రామములో ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, సరస్వతి విద్యామందిర్ పాఠశాల ఉన్నాయి.[4]

పర్యాటక స్థలాలు

[మార్చు]
ఎల్లమ్మ గుడి

ఈ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధిపొందినది. సా.శ. 17వ శతాబ్దంలో రేణుకాదేవి ఇక్కడ స్వయంభూగా వెలసినట్లు చారిత్రిక ఆధారాలున్నవి. కొండశిఖరంపై అమ్మవారు కొలువుదీరి, భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. ఆషాఢమాసంలో ఇక్కడ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:పేజీ.26
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Hayathnagar/Thorur
  5. ఈనాడు జిల్లా ఎడిషన్, 25 అక్టోబరు 2013

వెలుపలి లింకులు

[మార్చు]