థెరిసా మే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

థెరిసా మేరీ మే (జననం 1 అక్టోబర్ 1956) బ్రిటిష్ రాజకీయవేత్త. ఆమె 2016 నుండి 2019 వరకు యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేతగా పనిచేసింది. మే 2010 నుండి 2016 వరకు హోం సెక్రటరీగా పనిచేసింది. 1997 నుండి మైడెన్‌హెడ్‌కు పార్లమెంటు సభ్యురాలు (ఎంపి). సైద్ధాంతికంగా, ఆమె తనను తాను ఒకే-దేశం-సంప్రదాయవాదిగా పరిగణిస్తుంది.[1] మార్గరెట్ థాచర్ తరువాత యునైటెడ్ కింగ్ డమ్ కు ప్రధానమంత్రిగా, కన్సర్వేటివ్ పార్టీకి నాయకురాలిగా వ్యవహరించిన రెండో మహిళ, థెరిసా.

జీవిత విశేషాలు[మార్చు]

హ్యూబర్ట్ బ్రాసియర్, జైదీ మేరీ లకు థెరెసా 1956 అక్టోబరు 1 న జన్మించింది. ఆమె తండ్రి చర్చ్ ఆఫ్ ఇంగ్లండులో మతాధికారి. మే తల్లి కన్సర్వేటివ్ పార్టీ మద్దతుదారు. 1981 ఆమె తండ్రి కారు ప్రమాదంలో చనిపోయాడు.మరుసటి సంబ్వత్సరం ఆమె తల్లి మరణించింది.[2][3] తాను ఎంపీగా ఎన్నికవడం వాళ్ళు చూడలేకపోయారే అని థెరెసా బాధపడింది.[4]

మే ప్రారంభంలో హేత్రోప్‌లోని స్టేట్ స్కూల్ అయిన హేత్రోప్ ప్రైమరీ స్కూల్‌ లోను, తరువాత బెగ్‌బ్రోక్‌లోని రోమన్ కాథలిక్ స్వతంత్ర పాఠశాల అయిన సెయింట్ జూలియానా కాన్వెంట్ స్కూల్ ఫర్ గర్ల్స్ లోనూ చదివింది . [5] [6] [7]

13 ఏళ్ల వయస్సులో, ఆమె మాజీ హాల్టన్ పార్క్ గాళ్స్ గ్రామర్ స్కూల్ లో సీటు దక్కించుకుంది . [8] మే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివింది. సెయింట్ హ్యూస్ కాలేజీలో భూగోళ శాస్త్రం చదివింది. 1977 లో రెండవ తరగతి BA పట్టా పొందింది. [9] పకెట్ మనీ కోసం ఆమె శనివారం ఒక బేకరీలో పనిచేసింది. ఆమె "పొడవైన, ఫ్యాషన్ లను ఇష్టపడే యువతి, ఆమె చిన్నప్పటి నుంచీ మొదటి మహిళా ప్రధానమంత్రి కావాలన్న తన ఆశయం గురించి మాట్లాడేది" అని ఆమె గురించి తెలిసిన వారు అంటారు. [10] ఒక విశ్వవిద్యాలయ స్నేహితుడు పాట్ ఫ్రాంక్లాండ్ ప్రకారం: "ఆమెకు రాజకీయ అభిలాషలు లేని సమయం నాకు గుర్తులేదు. ఆ సమయంలో, మార్గరెట్ థాచర్ మొదటిసారిగా అక్కడికి వచ్చినప్పుడు ఆమెకు చాలా చిరాకు వచ్చింది " [11]

థెరెసా, పెట్టుబడి సంబంధాల నిర్వాహకుడైన ఫిలిప్ మే ను పెళ్ళి చేసుకుంది. [12] అతడు సెప్టెంబరు 6, 1980 నుండి కాపిటల్ ఇంటర్నేషనల్ [13] లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఆక్స్ఫర్డ్లో ఉన్న సమయంలో ఈ ఇద్దరిని పరిచయం చేశారని భావిస్తారు. [14] తమకు పిల్లలు పుట్టలేదని ఆమె బాధ పడింది . [15] వాళ్ళు నడక అంటే ఇష్టపడతారు. తమ సెలవు దినాలను క్రమం తప్పకుండా స్విస్ ఆల్ప్స్లో గడుపుతారు. [16] మే క్రికెట్ అభిమాని కూడ్. జెఫ్రీ బాయ్‌కాట్ ఆమె అభిమాన క్రీడా హీరోల్లో ఒకరని చెప్పింది. [17] ఆమెకు వంట అంటే ఇష్టం. ఆమెకు 100 కుకరీ పుస్తకాలు ఉన్నాయని చెప్పింది. ఆమె "చాలా మంచి కుక్" అని ఫిలిప్ చెప్పాడు. [18] [19]

రాజకీయాల్లో[మార్చు]

1977 లో పట్టభద్రురాలయ్యాక, ఆమె బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోను, అసోసియేషన్ ఫర్ పేమెంట్ క్లియరింగ్ సర్వీసెస్‌ లోనూ పనిచేసింది. ఆమె మెర్టన్ లోని డర్న్స్‌ఫోర్డ్ కౌన్సిలర్ గా కూడా పనిచేసింది. హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యేందుకు రెండు ప్రయత్నాలు విఫలమైన తరువాత, 1997 లో మైడెన్‌హెడ్‌కు ఎంపీగా ఎన్నికయింది. 1999 నుండి 2010 వరకు, మే షాడో క్యాబినెట్లలో అనేక పాత్రలు పోషించింది. ఆమె 2002 నుండి 2003 వరకు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది. 2010 సార్వత్రిక ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు, మే హోం కార్యదర్శిగాను, మహిళా, సమానత్వ మంత్రిగా నియమించారు. కాని 2012 లో ఈ రెండో పదవిని వదులుకుంది. 2015 సార్వత్రిక ఎన్నికలలో కన్జర్వేటివ్ విజయం తర్వాత తిరిగి హోం కార్యదర్శిగా నియమించబడినపుడు 60 ఏళ్లలో ఎక్కువ కాలం పనిచేసిన హోం కార్యదర్శి అయింది. ఆమె పదవీకాలంలో ఆమె పోలీస్ ఫెడరేషన్ సంస్కరణలను అనుసరించింది. ఖాట్ నిషేధంతో సహా డ్రగ్స్ విధానంపై కఠినమైన విధానాన్ని అమలు చేసింది. వలసలపై అదనపు ఆంక్షలను తీసుకువచ్చింది. పోలీస్, క్రైమ్ కమిషనర్లను ఎన్నిక చేసే ప్ద్ధతిని ప్రవేశపెట్టడం, అబూ ఖతాడాను బహిష్కరించడం, నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఏర్పాటు మొదలైన పనులను ఆమె పర్యవేక్షించింది. [20]

జూలై 2016 లో, డేవిడ్ కామెరాన్ రాజీనామా చేసిన తరువాత, మే కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైంది. మార్గరెట్ థాచర్ తరువాత UK కు రెండవ మహిళా ప్రధానమంత్రి అయింది. దేశం లోని నాలుగు అతి పెద్ద పదవుల్లో రెండింటిని పొందిన ఏకైక మహిళ ఆమె. యూరోపియన్ యూనియన్ నుండి యుకెను ఉపసంహరించుకునే ప్రక్రియను మొదలుపెడుతూ, మార్చి 2017 లో ఆర్టికల్ 50 ను ప్రారంభించింది. తరువాతి నెలలో, బ్రెక్సిట్ చర్చలలో తనను బలోపేతం చేసుకోవడం కోసం, తన " బలమైన, స్థిరమైన " నాయకత్వాన్ని ఎత్తిచూపే లక్ష్యంతోనూ ఆమె సార్వత్రిక ఎన్నికలను ప్రకటించింది. [21] [22] ఎన్నికల ఫలితాలు హంగ్ పార్లమెంటుకు దారి తీసాయి. 1983 తరువాత, పార్టీ అత్యధిక ఓట్ల శాతం సాధించినప్పటికీ కన్జర్వేటివ్ సీట్ల సంఖ్య 330 నుండి 317 కు పడిపోయింది. డెమోక్రటిక్ యూనియన్ పార్టీ (డియుపి) మద్దతుతో ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018 డిసెంబరులో కన్జర్వేటివ్ ఎంపీల నుండి అవిశ్వాస తీర్మానంపై ఆమె గెలుపొందింది. 2019 జనవరిలో ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస ఓటు నుండి బయటపడింది.

ప్రధానమంత్రిగా, చెకర్స్ ఒప్పందానికి కట్టుబడి యూరోపియన్ యూనియన్తో ఆమె బ్రెక్సిట్ చర్చలు జరిపింది, దీని ఫలితంగా బ్రెక్సిట్ ఉపసంహరణ ఒప్పందం జరిగింది . నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) కు 20 బిలియన్ డాలర్ల నిధుల పెంపును కూడా ఆమె పర్యవేక్షించింది, మొట్టమొదటి జాతి అసమానతల ఆడిట్‌ను స్థాపించింది. 25 సంవత్సరాల పర్యావరణ ప్రణాళికను ప్రారంభించింది. 2050 నాటికల్లా గ్లోబల్ వార్మింగ్‌కు యుకె అందజేసే వాటాను ముగించే వాతావరణ మార్పు చట్టం 2008 ను సవరించింది. ఆమె కాలంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో నిరుద్యోగం రికార్డు స్థాయికి పడిపోయింది. ఇది 1975 తరువాత కనిష్ట నిరుద్యోగిత రేటు. [23] ఆమె ముసాయిదా ఉపసంహరణ ఒప్పందం యొక్క సంస్కరణలను పార్లమెంటు మూడుసార్లు తిరస్కరించడంతో, ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసింది. మాజీ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాడు. ఆమె హౌస్ ఆఫ్ కామన్స్ లో ఏ పదవీ లేకుండా ఉంది .

మూలాలు[మార్చు]

  1. Quinn, Ben (30 June 2016). "Theresa May sets out 'one-nation Conservative' pitch for leadership". The Guardian. Retrieved 24 July 2018.
  2. Day, Elizabeth (27 July 2014). "Theresa May – what lies beyond the public image?". The Guardian. London. Archived from the original on 15 July 2016. Retrieved 10 July 2016.
  3. Mendick, Robert (9 July 2016). "The Oxford romance that has guided Theresa May from tragedy to triumph". The Daily Telegraph. London. Archived from the original on 11 July 2016. Retrieved 12 July 2016.
  4. "Theresa May on losing both parents at 25: I'm sorry they never saw me elected as an MP". inews. 3 October 2016. Archived from the original on 22 September 2017. Retrieved 11 May 2017.
  5. Kite, Melissa (15 May 2011). "How clashes with Theresa May led Dame Pauline Neville Jones to quit". The Sunday Telegraph. Archived from the original on 4 July 2016. Retrieved 5 July 2016.
  6. "Screaming arrival". BBC News. 8 May 2000. Archived from the original on 13 August 2017. Retrieved 20 October 2010.
  7. Sullivan, Paul (2012). The Little Book of Oxfordshire. New York: History Press. ISBN 978-0-7524-8243-9. Archived from the original on 17 నవంబరు 2017. Retrieved 5 July 2016.
  8. "Looking back with Theresa". Retrieved 31 May 2019.
  9. "Oxford University class list." The Times (London). 11 July 1977. p. 14.
  10. Stamp, Gavin (25 July 2016). "Who is Theresa May: A profile of UK's new prime minister". BBC News. Archived from the original on 16 May 2017. Retrieved 29 May 2017.
  11. Millington, Alison (8 June 2017). "The life and career of British Prime Minister Theresa May". Business Insider. Retrieved 17 May 2019.
  12. Orr, Deborah (14 December 2009). "Theresa May: David Cameron's lady in waiting". The Guardian. Archived from the original on 7 November 2013. Retrieved 9 June 2011.
  13. Becket, Adam (21 November 2017). "Who is Philip May? Theresa May's husband and closest advisor". Business Insider. Archived from the original on 16 August 2018. Retrieved 7 December 2018.
  14. "Profile: Theresa May's husband Philip". BBC News. 13 July 2016. Archived from the original on 19 July 2016. Retrieved 20 July 2016.
  15. Pearson, Allison (21 December 2012). "I was probably goody two-shoes: Theresa May interviewed". The Daily Telegraph. Archived from the original on 3 July 2016. Retrieved 3 July 2016.
  16. Khomami, Nadia (12 August 2016). "Theresa May seeks peace and quiet on Alpine walking holiday". The Guardian. Archived from the original on 12 August 2016. Retrieved 12 August 2016.
  17. "Prime Minister Theresa May spotted watching England vs Pakistan at Lord's cricket ground with husband Philip". The Daily Telegraph. 27 August 2016. Archived from the original on 2 September 2016. Retrieved 5 September 2016.
  18. Stamp, Gavin (25 July 2016). "Who is Theresa May: A profile of UK's new prime minister". BBC News. Archived from the original on 16 May 2017. Retrieved 29 May 2017.
  19. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; The Straits Times 2017 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  20. Rentoul, John (1 July 2016). "Boring and competent Theresa May is what the nation needs after the shock of the Brexit vote". Voices. The Independent. Archived from the original on 1 July 2016. Retrieved 2 July 2016.
  21. Crace, John (9 July 2018). "Political crises don't come much bigger than Brexit". GQ. Archived from the original on 1 ఏప్రిల్ 2019. Retrieved 10 July 2018.
  22. "General election 2017: Why did Theresa May call an election?". BBC News. 9 June 2017. Archived from the original on 5 September 2017. Retrieved 4 September 2017.
  23. "UK Labour Market, July 2017". ONS. 2017-07-12. Retrieved 2017-07-12.
"https://te.wikipedia.org/w/index.php?title=థెరిసా_మే&oldid=3880581" నుండి వెలికితీశారు