ధనంజయుని కలమళ్ళ శాసనం

వికీపీడియా నుండి
(దనంజయుని కలమళ్ళ శాసనము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కలమళ్ళ శాసనం

కలమళ్ళ శాసనము కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని కలమళ్ళ గ్రామంలో ఉంది. దీన్ని సా.శ. 575లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించాడు. ఇందులో వారు అనే బహువచనం కనిపిస్తుంది. తొలి తెలుగు శాసనాలలో ఇది ఒకటి.[1]

ఎరికల్ ముతురాజు అనేబిరుదుగల ధనంజయుడనే రాజు అంటూ ఈ శాసనం మొదలౌతుంది. మధ్యలో కొంత భాగం అసంపూర్ణంగా ఉంది. పంచమహాపాతకుడు అవుతారని చెబుతూ ఈ శాసనం ముగుస్తుంది. ఇందులో శకటరేఫను వాడారు.

మహారాజు, మహా రాజాధిరాజు, యువరాజు (దుగరాజు) అనే పదాలు రాజ పదవులలో ఉండే వివిధ స్థాయీ భేదాలను తెలుపుతాయి. అలాగే ఈ శాసనంలో వాడిన ముత్తురాజు అనే పదం కూడా రాజు యొక్క స్థాయిని సూచిస్తుందని ఈ శాసనాన్ని పరిష్కరించిన ముట్లూరి వెంకటరామయ్య, ప్రొఫెసరు కె.ఎ.నీలకంఠ శాస్త్రి అన్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు శాసనాలు (1975); రచించినవారు జి. పరబ్రహ్మ శాస్త్రి

ఇతర లింకులు

[మార్చు]