దమ్దామా సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దమ్దామా సరస్సు

దమ్దామా సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల గురుగ్రామ్ జిల్లాలో కలదు. ఇది 1947 లో బ్రిటిష్ వారు వర్షపు నీటి సేకరణ కోసం నిర్మించిన ఆనకట్ట ద్వారా ఏర్పడింది.[1][2]

విస్తీర్ణం[మార్చు]

ఆరావళి కొండల దిగువ ప్రాంతంలో ఈ సరస్సు నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సు నీటి మట్టం 20 అడుగుల (6.1 మీ) వరకు ఉంటుంది. వర్షాకాలంలో నీటి మట్టం 50 అడుగులు (15 మీ) - 70 అడుగుల (21 మీ) వరకు పెరుగుతుంది.[3][4]

ఉష్ణోగ్రత[మార్చు]

అక్టోబర్ నుండి మార్చి వరకు, వేసవికాలం, వర్షాకాలంలలోసరస్సును సందర్శించడానికి అనువైన సమయం. వేసవిలో వాతావరణం సాధారణ వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 45–47°C వరకు ఉంటుంది.[5][6]

పక్షులు[మార్చు]

దమ్దామా సరస్సు పక్షులకు సహజమైన నివాసం, 190 జాతులకు పైగా వలస, స్థానిక పక్షులు వేసవి, వర్షాకాలం, శీతాకాలంలలో దీనిని సందర్శిస్తాయి. అనగా ఏడాది పొడవునా వివిధ ప్రదేశాల నుండి వివిధ రకాల పక్షులు వస్తాయి. నీటి కోడి, క్రేన్లు, కార్మోరెంట్స్, టెర్న్లు, ఎగ్రెట్స్, కింగ్‌ఫిషర్లు మొదలైనవి ఇక్కడ కనిపించే కొన్ని ప్రధాన పక్షులు.[7]

మూలాలు[మార్చు]

  1. Rajiv Tiwari, "Delhi A Travel Guide", ISBN 9798128819703.
  2. "Damdama Lake, Haryana".
  3. ASOLA BHATTI WILD LIFE SANCTUARY Archived 16 ఆగస్టు 2011 at the Wayback Machine, Department of Forest, Delhi Government
  4. Govt plans 10-acre lake in foothills of Aravallis, Hindustan Times, 19 August 2019.
  5. "पाली गांव की पहाड़ियों पर बनेगा डैम, रोका जाएगा झरनों का पानी". Navbharat Times.
  6. Gurgaon the fragrance of colorful flowers in the mountain of Damdama, Jagran, 5 Feb 2021.
  7. "The Tribune, Chandigarh, India - Haryana". www.tribuneindia.com.