Jump to content

దర్బారు రాగం (పుస్తకం)

వికీపీడియా నుండి
దర్బారు రాగం
కృతికర్త: శ్రీలాల్ శుక్లా
అసలు పేరు (తెలుగులో లేకపోతే): రాగ్ దర్బారీ
అనువాదకులు: ముద్దసాని రాంరెడ్డి
ప్రచురణ:
విడుదల: 1993 (అనువాదం)
1973 (హిందీ మూలం)

దర్బారు రాగం పుస్తకం ప్రముఖ హిందీ రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత శ్రీలాల్ శుక్లా రచించిన నవలకు తెలుగు అనువాదం. ప్రముఖ అనువాదకుడు ముద్దసాని రాంరెడ్డి ఈ నవలను అనువదించారు.

రచన నేపథ్యం

[మార్చు]

శ్రీలాల్ శుక్లా హిందీ నవల రాగ్ దర్బారీ ఈ పుస్తకానికి మూలం. ఈ నవలను శుక్లా 1973లో రచించారు. రాగ్ దర్బారీ రచనకు శుక్లా భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా పేర్కొనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. రాగ్ దర్బారీ నవలను తెలుగులోకి దర్బారు రాగం శీర్షికన ప్రముఖ అనువాదకుడు ముద్దసాని రాంరెడ్డి అనువదించారు. అనువాద నవల ప్రథమ ముద్రణ 1993లో జరిగింది.

రచయిత గురించి

[మార్చు]

శ్రీ లాల్ శుక్లా (డిసెంబరు 31 1925 - అక్టోబరు 28 2011[1])ప్రముఖ హిందీ రచయిత. ఈయన హిందీ భాషలో వ్యంగ్య రచయితగా ప్రసిద్ధి పొందారు. ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్(బ్రిటీష్ ఇండియాలో) ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్(పి.సి.ఎస్.) అధికారిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో భాగమయ్యారు. ప్రముఖ హిందీ రచయిత. ఈయన హిందీ భాషలో వ్యంగ్య రచయితగా ప్రసిద్ధి పొందారు. ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్(బ్రిటీష్ ఇండియాలో) ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్(పి.సి.ఎస్.) అధికారిగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో భాగమయ్యారు. ఆయన 25 పుస్తకాలు [2] రచించారు. ఆయన రచనలలో మకాన్ (తిండి/రొట్టె), సోని ఘాటీ కా సూరజ్ (సోనీ ఘాటీ సూర్యుడు), పెహ్లా పడావ్ (ముందు చదువుకో), బిస్రాంపూర్ కా సంత్ (బిస్రాంపూర్ సాధువు) ముఖ్యమైన నవలలు. 1969లో రాగ్ దర్బారీ నవలా రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1999లో బిశ్రాంపూర్ కా సంత్ నవల రచనకు వ్యాస్ సమ్మాన్,[2][3] 2008లో సాహిత్యరంగంలో చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారం,[4] 2009లో ఆయన సాహిత్య కృషికి జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు.

ఇతివృత్తం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Noted Hindi Novelist and Satirist Shrilal Shukla Passed Away". Jagranjosh.com. Archived from the original on 2013-09-14. Retrieved 2011-11-28.
  2. 2.0 2.1 "Vyas Samman 1999". Archived from the original on 2007-03-10. Retrieved 2014-02-23.
  3. Vyas Samman 1999 In brief - The Tribune, December 15, 1999.
  4. Padma Bhushan Official listings Govt. of India website.