Jump to content

దర్బార్ (సినిమా)

వికీపీడియా నుండి
దర్బార్
దర్శకత్వంఏఆర్‌ మురుగదాస్‌
స్క్రీన్ ప్లేఏఆర్‌ మురుగదాస్‌
నిర్మాతఎ.సుభాస్కరన్
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ శివ‌న్‌
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుద్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీs
9 జనవరి, 2020
సినిమా నిడివి
150 మినిషాలు[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

దర్బార్ 2020లో తమిళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యార్ పై రజనీకాంత్‌, నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 9 జనవరి 2020న విడుదలైంది.[2]

ముంబై పోలీసు కమిషనర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) ఎన్‌కౌంట‌ర్లకి పెట్టింది పేరు. ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్‌స్టర్‌లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్‌కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్‌ సభ్యులను కూడా బెదిరిస్తాడు. మాద‌క ద్రవ్యాలు, మ‌హిళ‌ల అక్రమ ర‌వాణా ముఠాల్ని అంతం చేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్‌ మల్హోత్రాను అరెస్టు చేసి అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్‌ ను హతమారుస్తాడు. డ్రగ్‌లార్డ్‌, మొబ్‌స్టర్‌ అయిన హరిచోప్రా (సునీల్‌ శెట్టి) ప్రతీకారానికి తెగబడి ఆదిత్య కూతురు వ‌ల్లి (నివేదా థామ‌స్) తో పాటు విక్కీ మల్హోత్రాని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • తరం మారా సింగిల్, రచన: వివేక్ , గానం. అనిరుద్ రవిచందర్ , అర్జున్ చండీ
  • కన్నుల తిమిరు , రచన: వివేక్ , గానం .చంద్రముఖి , రచన , ప్రియామూర్తి
  • చుమ్మా కిషి , రచన: వివేక్, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , అనిరుద్ రవిచందర్
  • డుమ్మ్ దుమ్మ్ , రచన: వివేక్, గానం . నకశ్ అజీజ్
  • తాని వాజీ , రచన: యోగి బి, సెంతుజహన్ అండ్ స్యాన్ , గానం. అనిరుద్ రవి చందర్, శక్తి శ్రీ గోపాల్.

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Darbar (2019)". British Board of Film Classification. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2020.
  2. Sakshi (9 January 2020). "దర్బార్‌ : మూవీ రివ్యూ". Sakshi. ఒరిజినల్ నుండి 18 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2021.
  3. Eenadu (9 January 2021). "రివ్యూ: ద‌ర్బార్‌". www.eenadu.net. ఒరిజినల్ నుండి 18 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2021.