దిండి జలాశయం
దిండి జలాశయం (రిజర్వాయర్' తెలంగాణా రాష్ట్రంలో కృష్ణా నది మీద దిండి ఉపనది అంతటా విస్తరించిన ఒక మధ్య తరగతి జలాశయం [1][2] ఇది శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువలోని భాగం.[3]ఈ జలాశయం నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోను, హైదరాబాదు నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కృష్ణా నది
[మార్చు]భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగలు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయ్ చూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ప్రవేశిస్తుంది. తరువాత కర్నూలుకు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-27. Retrieved 2014-11-01.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ http://news.google.com/newspapers?id=Asc-AAAAIBAJ&sjid=lUwMAAAAIBAJ&pg=5009,99087&dq=dindi+reservoir&hl=en
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-16. Retrieved 2014-11-01.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-20. Retrieved 2015-05-12.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)