దిశా పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిశా పాండే
Disha Pandey by Venket Raam.jpg
దిశా పాండే
జననం (1994-01-17) 17 జనవరి 1994 (వయస్సు 27)[1]
ఖేత్రి నగర్, ఝంజున్, జైపూర్, రాజస్థాన్, భారతదేశం
వృత్తిసినిమా నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010 - ప్రస్తుతం

దిశా పాండే భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు,[2] తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.[3][4]

జీవిత విషయాలు[మార్చు]

దిశా పాండే 1994, జనవరి 17న రాజస్థాన్, జైపూర్ లోని ఖేత్రి నగర్ లో జన్మించింది. ఢిల్లీలో పెరిగింది.[5] దిశా తండ్రి విద్యా విభాగంలో గెజిట్ అధికారి కాగా, తల్లి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో పనిచేస్తోంది. బిఏ (మానవ హక్కులు) డిగ్రీని పూర్తిచేసింది.[6]

సినిమారంగం[మార్చు]

ప్రిన్స్ జ్యూవెలరీ, అముల్ లస్సీ వంటి వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో నటించింది.[7]

2012లో నితిన్ సత్యతో కలిసి మయాంగినెన్ తయాంగినెన్ అనే తమిళ చిత్రంలో కాల్ టాక్సీ కంపెనీలో పనిచేసే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో నటించింది.[8] 2013లో రమేష్ రాపర్తి దర్శకత్వంలో వచ్చిన రేస్ అనే చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వచ్చిన సారే జహాన్ సే మెహంగా (2013) అనే హిందీ చిత్రంలో కూడా నటించింది.[5] 2013లో శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించిన మోక్ష అనే తెలుగు భయానక చిత్రంలో నటించింది.

2015లో జైలలిత (మలయాళం మాయమోహిని కన్నడ రీమేక్ ) చిత్రంలో మలయాళ నటి మైథిలి పోషించిన పాత్రతో కన్నడ సినిమారంగంలోకి ప్రవేశించింది.[9]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2009 బోలో రామ్ జూహి ఖాన్ హిందీ హిందీ తొలిచిత్రం
2010 తమీజ్ పదం ప్రియ తమిళ తమిళ తొలిచిత్రం
2012 మయాంగినెన్ తయాంగినెన్ శృతి
2013 రేస్ ఆర్తి తెలుగు తెలుగు తొలిచిత్రం
సారే జహాన్ సే మెహంగా సుమన్ హిందీ
కీరిపుల్ల సంధ్య తమిళం
మోక్ష దిశ తెలుగు
2015 మనసును మాయ సేయకే లాస్య
జై లలిత దిశ కన్నడ కన్నడ తొలిచిత్రం
మనదిల్ మాయం సెయిదయి లాస్య తమిళం
సుబ్రమణి[10] కన్నడ
బొంబాయి మిట్టాయి[11] అదితి
కంట్రోల్-సి దిశ తెలుగు
2018 తమీజ్ పదం 2 ప్రియ తమిళ
2019 అధ్యక్ష ఇన్ అమెరికా సిమ్రన్ కన్నడ

మూలాలు[మార్చు]

 1. newsbugz.com (25 January 2019). Retrieved 2 June 2020
 2. "Bolo Raam". Indian Express. 28 May 2010. Retrieved 2 June 2020. CS1 maint: discouraged parameter (link)
 3. "Laugh away your blues -- Tamizh Padam". The Hindu. 5 February 2010. Retrieved 2 June 2020. CS1 maint: discouraged parameter (link)
 4. "'Thamizh Padam' heroine watches 70 Tamil films". IndiaGlitz. 23 March 2010. Retrieved 2 June 2020. CS1 maint: discouraged parameter (link)
 5. 5.0 5.1 "Disha Pandey". BollywoodCelebFacts.com.
 6. Malini, Shankaran (13 June 2011). "'Tamizh Padam' Disha Pandey". The New Indian Express. Retrieved 4 June 2020. CS1 maint: discouraged parameter (link)
 7. "The Taste of India". Amul. 25 June 2013. Archived from the original on 4 జూన్ 2020. Retrieved 4 June 2020. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 8. Bharathan, Bijoy (16 November 2010). "Ready for more 'Tamizh Padams'". The Times of India. Retrieved 4 June 2020. CS1 maint: discouraged parameter (link)
 9. "Disha and Aishwarya make their Kannada debut". The Times of India. 1 July 2013. Retrieved 4 June 2020. CS1 maint: discouraged parameter (link)
 10. "Disha Pandey paired opposite to Srinagara Kitty". The Times of India. 23 April 2014. Retrieved 4 January 2019. CS1 maint: discouraged parameter (link)
 11. http://www.newindianexpress.com/entertainment/kannada/Love-for-Travel-Made-Disha-Sign-Bombay-Mittai/2014/04/02/article2145209.ece

ఇతర లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.