మనసును మాయ సేయకే
మనసును మాయ సేయకే (2014 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సురేష్ పి కుమార్ |
---|---|
నిర్మాణం | జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్ |
తారాగణం | ప్రిన్స్ సేతు రిచా పనాయ్ దిశా పాండే |
సంగీతం | మణికాంత్ |
విడుదల తేదీ | 24 జనవరి, 2014 |
భాష | తెలుగు |
మనసును మాయ సేయకే 24 జనవరి 2014 లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] జైసన్ పులికొట్టిల్ – విన్స్ మంగడన్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ పి కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రిన్స్, సేతు, రిచా పనాయ్, దిశా పాండే తదితరులు నటించగా, మణికాంత్ సంగీతం అందించాడు.[3]
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]జై (సేతు) ఒకపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండి. జై భార్య మైథిలి (రిచా పనాయ్). జై ప్రేమించి మైథిలిని పెళ్ళి చేసుకున్నప్పటికీ తనతో సరిగ్గా ఉండడు. ఇది పక్కన పెడితే అనాథ అయిన శివ (ప్రిన్స్) వన్యప్రాణి ఫోటో గ్రాఫర్. శివ సివిల్ ఆర్కిటెక్ట్ అయిన లాస్య (దిశా పాండే) ని చూసి ప్రేమలో పడతాడు. శివ తన ప్రేమని చెప్పాలనుకునే టైంలోనే లాస్య ఆత్మ హత్య చేసుకుంటుంది. అక్కడి నుండి కట్ చేస్తే శివ ఆకాశ రామన్నలా జైకి కాల్ చేసి తన చేతే తన ఫ్రెండ్స్ ని చంపిస్తుంటాడు. అసలు లాస్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అసలు శివ జై చేత తన సొంత ఫ్రెండ్స్ ని ఎందుకు చంపేలా చేసాడు? జైకి శివకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది సినిమా క్లైమాక్స్.
నటవర్గం
[మార్చు]- సేతు (నటుడు)
- ప్రిన్స్ (శివుడు)
- దిశా పాండే (లాస్య)
- రిచా పనాయ్ (మిథిలి)
- మనోబాల (సుందరం)
- విక్రమ్ సింగ్ (రాకీ)
పాటలు
[మార్చు]తమిళ, తెలుగు సినిమాల్లో పనిచేసిన ఈ చిత్రానికి మణికాంత్ సంగీతం సమకూర్చాడు. 2013, మార్చి 27న హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ "I'm open to any kind of cinema: Disha - The New Indian Express". Archived from the original on 2016-06-05. Retrieved 2021-02-27.
- ↑ "Prince works with three debutants - The Times of India". Archived from the original on 2013-12-03. Retrieved 2021-02-27.
- ↑ "postnoon.com". Archived from the original on 2013-08-07. Retrieved 2021-02-27.