మోక్ష (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోక్ష
Moksha Telugu Cinema Poster.jpg
మోక్ష సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీకాంత్ వేములపల్లి
నిర్మాతపి. అమర్‌నాథ్ రెడ్డి
రచనశ్రీకాంత్ వేములపల్లి
నటులుమీరా జాస్మిన్, రాజీవ్ మోహన్, దిశా పాండే, నాజర్
సంగీతంవిజయ్ కూరాకుల
ఛాయాగ్రహణంవెంకట ప్రసాద్
కూర్పుఎం.ఆర్. వర్మ
పంపిణీదారుఅమర్నాథన్ మూవీస్
విడుదల
28 జూన్ 2013 (2013-06-28)
నిడివి
97 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చుINR1 (1.6)
బాక్సాఫీసుINR2 (3.2)(9 రోజులు)

మోక్ష 2013, జూన్ 28న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] అమర్నాథన్ మూవీస్ పతాకంపై శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో మీరా జాస్మిన్, రాజీవ్ మోహన్, దిశా పాండే, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి విజయ్ కూరాకుల సంగీతం అందించాడు.[2]

కథ[మార్చు]

శీను (రాజీవ్ మీనన్) భయస్తుడైన కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ లో ప్రతి ఒక్కరూ తనని ఏడిపిస్తూ కొడుతూ ఉంటారు. కానీ నిషా (దిశా పాండే) మాత్రం అతన్ని ప్రేమిస్తుంటుంది. శీనుకి నిషా అంటే ఇష్టముండదు. అదే టైంలో తన పక్క అపార్ట్ మెంట్ లో మోక్ష (మీరా జాస్మిన్) తన తండ్రి నాజర్ తో కలిసి దిగుతుంది. మోక్ష పగలు అసలు బయటే రాదు రాత్రైతే బయటకి వస్తుంది. ఆ సమయలో మోక్షతో శీనుకి పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే చాలా రోజుల నుండి వారు ఉన్న ఏరియాలో కొన్ని మర్డర్లు జరుగుతుంటాయి. మర్డర్స్ కి మోక్ష కి ఏమన్నా సంబంధం ఉందా? లేదా? అనేదే మిగిలిన కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, దర్శకత్వం: శ్రీకాంత్ వేములపల్లి
 • నిర్మాత: పి. అమర్‌నాథ్ రెడ్డి
 • సంగీతం: విజయ్ కూరాకుల
 • ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్
 • కూర్పు: ఎం.ఆర్. వర్మ
 • పంపిణీదారు: అమర్నాథన్ మూవీస్

ఇతర వివరాలు[మార్చు]

 1. శ్రీకాంత్ ఇంతకుముందు 2008లో బ్లాక్ అండ్ వైట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అది విమర్శకుల ప్రశంసలు పొందింది.[3]
 2. 2010లో వచ్చిన లెట్ మి ఇన్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[4]
 3. భారతీయ నటి మీరా జాస్మిన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది.[5]
 4. రాజీవ్ మోహన్, దిషా పాండే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించగా,[6] నాజర్, రాహుల్ దేవ్, సన సహాయకపాత్రలు పోషించారు.
 5. 2009 నవంబరులో షూటింగ్ ప్రారంభమై[7] హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీతోపాటు చెన్నైలో కూడా షూటింగ్ జరుపుకుంది.[8]
 6. ఈ చిత్రం పూర్తిగా కొత్తగా, భారతీయ తెరపై ఇంతకుముందెన్నడూ తీయని విధంగా రూపొందింది.[9]

మూలాలు[మార్చు]

 1. http://www.indiaglitz.com/channels/telugu/article/94843.html
 2. "Meera Jasmine's 'Moksha' release on June 28th". indiaglitz.com. Retrieved 19 July 2019.
 3. "Archived copy". Archived from the original on 9 December 2010. Retrieved 1 September 2019.CS1 maint: archived copy as title (link)
 4. "Archived copy". Archived from the original on 18 February 2013. Retrieved 1 September 2019.CS1 maint: archived copy as title (link)
 5. http://timesofindia.indiatimes.com/entertainment/movie-reviews/movie-review/20815552.cms
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-01. Retrieved 2019-09-01.
 7. http://www.sify.com/movies/boxoffice.php?id=14918195&cid=2364[permanent dead link]
 8. http://www.indiaglitz.com/channels/telugu/article/52088.html
 9. http://entertainment.oneindia.in/telugu/top-stories/2009/meera-movie-moksha-271109.html

ఇతర లంకెలు[మార్చు]