Jump to content

దీపికా అమీన్

వికీపీడియా నుండి
దీపికా అమీన్
2018లో దీపికా అమీన్
జననం
దీపికా దేశ్‌పాండే

(1967-09-13) 1967 సెప్టెంబరు 13 (వయసు 57)
ముంబై, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1993-ప్రస్తుతం

దీపికా అమీన్ (జననం దీపికా దేశ్‌పాండే ) హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి. ఆమె ఫ్యాన్, రాంఝణా, హంప్టీ శర్మ కీ దుల్హనియా చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె టీవీ షోలు ఫర్మన్, తాష్న్-ఎ-ఇష్క్ లలో కూడా పనిచేసింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

దీపికా అమీన్ ముంబైలో జన్మించింది. అయితే, ఆమె ఆమె ఢిల్లీలో పెరిగింది, లోరెటో కాన్వెంట్ లోని పాఠశాలకు హాజరైంది, ఢిల్లీ విశ్వవిద్యాలయం లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఆర్థికశాస్త్రం (ఆనర్స్) చేసింది.[2]

ఆమె తండ్రి ఉల్హాస్ దేశ్‌పాండే, భారత వైమానిక దళంలో ఎయిర్ వైస్ మార్షల్ గా పనిచేసాడు. కాగా, తల్లి క్షమా దేశ్‌పాండే కథక్ నృత్యకారిణి. దీపిక తాతయ్య సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మరాఠీ కవి ఆత్మారామ్ రావాజీ దేశ్‌పాండే. అలాగే, నాయనమ్మ కుసుమావతి దేశ్‌పాండే, మరాఠీ సాహిత్య రచయిత్రి, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ప్రొఫెసర్‌గా కూడా ఉంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1995 అబ్ ఇన్సాఫ్ హోగా ఖుష్బూ ప్రసాద్
2009 వెల్ డన్ అబ్బా లతా, ఇన్స్పెక్టర్ భార్య
2011 పడురామ్ ప్రిన్సిపాల్, శ్రీమతి ఇంజనీర్
2013 రాంఝణా జోయా తల్లి
రజ్జో కమలాదేవి
2014 బేవకూఫియాన్ రూపాలి వాధ్వా (మోహిత్ బాస్)
2014 హంప్టీ శర్మ కీ దుల్హనియా కావ్య తల్లి
2016 ఫ్యాన్ గౌరవ్ తల్లి
రఫ్ బుక్ బీనా
2017 దిల్ జో నా కెహ్ సాకా కరుణ కపూర్
2018 సోనూ కే టిటు కీ స్వీటీ శ్రీమతి శర్మ (స్వీటీ తల్లి)
2019 గాన్ కేష్ దేబాశ్రీ దాస్గుప్తా, ఎనాక్షి తల్లి
మర్దానీ 2 డాక్టర్ హర్నీ కపూర్
2020 ఘూమకేతు శ్రీమతి బద్లానీ జీ5లో విడుదల
2021 రాంప్రసాద్ కి తెహ్ర్వి రాంప్రసాద్ కోడలు నెట్‌ఫ్లిక్స్ విడుదల
2022 తారా వర్సెస్ బిలాల్ బిలాల్ ఖాన్ యొక్క ఫూఫీ (అత్త) షన్నో నెట్‌ఫ్లిక్స్ విడుదల
2023 ఇష్క్-ఎ-నాదాన్ రేఖా జియో సినిమా విడుదల

మూలాలు

[మార్చు]
  1. "SRK is as enthusiastic and fun-loving as he was: Deepika Deshpande Amin | Latest News & Updates at Daily News & Analysis" (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-14. Archived from the original on 19 May 2016. Retrieved 2016-07-18.
  2. "FILM STAR'S JOURNEY THROUGH YOUTH". www.afternoondc.in. Archived from the original on 16 June 2016. Retrieved 2016-07-18.