దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 27 మే 1971
నల్లసింగయ్యగారి పల్లి, నల్లమాడ మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటరామి రెడ్డి, పద్మావతమ్మ
జీవిత భాగస్వామి అపర్ణ
సంతానం ఇషా రెడ్డి & కిషన్ రెడ్డి

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, నల్లసింగయ్యగారి పల్లి గ్రామంలో వెంకటరామిరెడ్డి, పద్మావతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1990లో కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశాడు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విద్యాభాస్యం పూర్తి అయ్యాక కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో వివిధ హోదాల్లో 9 సంవత్సరాలపాటు పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆయన తరువాత కన్ స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి సాయి సుధీర్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం స్థానం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప చేతిలో ఓడిపోయాడు.దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి పై 31255 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Puttaparthi Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌ సీపీ అనంతపురం అభ్యర్థులు వీరే." Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  3. Sakshi (25 May 2019). "కొత్త కొత్తగా ఉన్నది". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.