దూరదర్శన్ (టివి ఛానల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దూరదర్శన్
దూరదర్శన్
రకము ప్రచార టి.వి. నెట్‌వర్క్[తెలుగు పదము కావాలి]
దేశము India భారతదేశము
లభ్యత జాతీయ స్థాయి
యజమాని ప్రసార భారతి
కీలక వ్యక్తులు కె.యస్. శర్మ
ఆవిర్భావ దినం 1959
ఇతరపేర్లు ఆల్ ఇండియా రేడియో
జాలగూడు డి.డి. ఇండియా

దూరదర్శన్, భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్. భారత ప్రభుత్వం చేత నియమించబడ్డ ప్రసార భారతి బోర్డు ద్వారా నడుపబడుతోంది. ఇది స్టూడియోస్, ట్రాన్స్మిటర్ల యొక్క అవస్థాపన విషయంలో భారతదేశం అతి పెద్ద ప్రసార సంస్థలు ఒకటి. ఇటీవల, డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్సమీటర్ల ద్వారా ప్రసారం చెయ్యడం ప్రారంభించారు. 2009 సెప్టెంబరు 15 న, దూరదర్శన్ తన 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. దూరదర్శన్ టెలివిజన్, రేడియో, ఆన్లైన్, మొబైల్ సేవలను భారతదేశం అంతటా అందిస్తుంది.

ప్రారంభం

[మార్చు]

సెప్టంబరు 1959లో ఒక చిన్న ట్రాన్స్‌మీటర్ తో మొదలైంది. 1972 లో టి.వి. కార్యక్రమాలు మొదలై 1976 లో రేడియోను టి.వి. నుండి వేరు చేశారు. దూరదర్శన్ ఒక చిన్న ట్రాన్స్మిటర్, తాత్కాలిక స్టూడియోతొ సెప్టెంబరు 1959 15 న ఢిల్లీలో ప్రయోగాత్మక ప్రసారం చేయడం ద్వారా ప్రారంభం అయింది. 1965 నుండి ఆల్ ఇండియా రేడియోగా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. టెలివిజన్ సర్వీసును 1972 లో బొంబాయి, అమృత్సర్ వరకు విస్తరించారు. 1975 వరకు కేవలం ఏడు నగరాలకు మాత్రమే టెలివిజన్ సర్వీసు ఉన్నది, దూరదర్శన్ భారతదేశంలో టెలివిజన్ యొక్క ఏకైక ప్రదాతగా ఉంది. టెలివిజన్ సేవలను 1976 ఏప్రిల్ 1 లో రేడియో నుంచి విడదీసారు. రేడియో, దూరదర్శన్ను ఢిల్లీలో రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్స్ నిర్వహణ కింద ఉంచారు. చివరిగా, 1982 లో, దూరదర్శన్ ఒక దేశీయ ప్రసారిగా ఉనికిలోకి వచ్చింది.

జాతీయ కార్యక్రమాలు

[మార్చు]

నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరం కలర్ టి.వి.లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు (సోప్ ఓపెరాలు) హమ్ లోగ్ (1986), బుని యాద్ (1986-87), రామాయణ్ (1987-88), మహాభారత్ (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు చిత్రహార్, రంగోలీ లు, క్రైమ్ థ్రిల్లర్లు బ్యోమ్‌కేశ్ బక్షీ, జాన్‌కీ జాసూస్లు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. dd sports lo india vs south africa vastadi

ప్రస్తుతం 19 ఛాన్నల్ల ద్వారా ప్రసారాలు లభ్యమవుతున్నాయి.

ఛానల్
డి డి నేషనల్ ఢిల్లీ
డి డి న్యూస్ ఢిల్లీ
డి డి లోక్ సభ ఢిల్లీ
డి డి రాజ్య సభ ఢిల్లీ
డి డి భారతి ఢిల్లీ
డి డి స్పోర్ట్స్ ఢిల్లీ
డి డి బంగ్లా కోల్‌కతా
డి డి చందన బెంగులూరు
డి డి కాశ్మీర్ జమ్ము
డి డి ఉర్దూ ఢిల్లీ
డి డి పంజాబీ చండీఘడ్
డి డి నార్త్ ఈస్ట్ గవహతి
డి డి సాహ్యద్రి ముంబయి
డి డి గుజరాతి అహ్మదాబాద్
డి డి మలయాళం తిరువనంతపురం
డి డి పొదిగై చెన్నై
డి డి యాదగిరి హైదరాబాద్
డి డి సప్తగిరి విజయవాడ
డి డి ఒరియా భువనేశ్వర్
డి డి మణిపూర్ మణిపూర్

ఇవి కూడా చూడండి.

[మార్చు]

బైట లింకులు

[మార్చు]

మూలములు

[మార్చు]