దేవయాని ఖోబ్రగడే
దేవయాని ఖోబ్రగడే | |
---|---|
జననం | తారాపూర్, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఇండియన్ ఫారిన్ సర్వీస్ కేడర్ లో సెంట్రల్ సివిల్ సర్వెంట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
ఉద్యోగం | భారత ప్రభుత్వం |
విదేశాంగ మంత్రిత్వ శాఖ (భారతదేశం) | |
జీవిత భాగస్వామి | Aakash Singh Rathore |
పిల్లలు | Amaya Singh Khobragade, Shaira Singh Khobragade |
తల్లిదండ్రులు | ఉత్తమ్ ఖోబ్రగడే (తండ్రి)[1] |
దేవయాని ఖోబ్రగడే ఇండియన్ ఫారిన్ సర్వీస్ కేడర్‌లో సెంట్రల్ సివిల్ సర్వెంట్. అమెరికాలోని న్యూయార్క్‌లో భారత కాన్సుల్‌లో ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు వీసా మోసానికి పాల్పడి వార్తల్లో నిలిచింది. ఆమె ప్రస్తుతం కంబోడియాకు భారత రాయబారిగా నమ్ పెన్లో (Phnom Penh)ని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నది.[2]
2016లో ఆమె ది వైట్ సారి (The White Sari) అనే పుస్తకాన్ని ప్రచురించింది.[3]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]దేవయాని ఖోబ్రగడే మహారాష్ట్రలోని తారాపూర్‌లో గడ్చిరోలికి చెందిన బౌద్ధ కుటుంబంలో జన్మించింది.[4][5] ఆమె తండ్రి, ఉత్తమ్ ఖోబ్రగడే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో అధికారి. అనేక అవినీతి కుంభకోణాల్లో కూడా ఇతడు చిక్కుకున్నాడు.[6][7][8]
ఆమె ముంబైలోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో చదివింది. ఆమె కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ సేథ్ గోర్ధన్‌దాస్ సుందర్‌దాస్ మెడికల్ కాలేజీ నుండి వైద్యశాస్త్రంలో పట్టా పొందింది.[9]
కెరీర్
[మార్చు]దేవయాని ఖోబ్రగడే 1999లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరింది. 2012లో, న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఆమె డిసెంబరు 2013 వరకు డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేసింది. ఆమె మహిళల వ్యవహారాలతో పాటు రాజకీయ, ఆర్థిక సమస్యలను కూడా నిర్వహించింది.[10] యాక్టింగ్ కాన్సుల్ జనరల్‌గా, ఆమె ఏప్రిల్ 2013లో న్యూయార్క్‌లోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్-జనరల్‌లో మహిళల హక్కులు, భారతదేశంలో జనాభా ప్రభావంపై తన వ్యక్తిగత దృక్పథాన్ని అందించింది.[11]
2014 జనవరి 20న ఆమె డెవలప్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ (DPA) డైరెక్టర్‌గా న్యూ ఢిల్లీకి పోస్ట్ చేయబడింది, ఇది 2013లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భారతదేశం విదేశీ ప్రాజెక్టులను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది.[12] డిసెంబరు 2014లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమెను ఈ పదవి నుండి తొలగించి, "నిర్బంధ నిరీక్షణ"లో ఉంచింది.[13] జూలై 2015లో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా తిరిగి నియమించబడింది, అయితే, ఈసారి రాష్ట్ర ప్రభుత్వాల విభాగంలో.[14][15] పెట్టుబడులు, సంస్కృతి, పర్యాటకం, గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రవాసుల శ్రేయస్సు వంటి రంగాలలో విదేశాలలో దాని ప్రయోజనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆమె కేరళతో కలిసి పనిచేయడానికి ఎంచుకుంది.[16]
ఆమె 2012లో చెవెనింగ్ రోల్స్ రాయిస్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయబడింది.[17]
ఆమె 2020 అక్టోబరు 2న కంబోడియాకు రాయబారిగా నియమించబడింది.[18]
వ్యక్తిగత జీవితం
[మార్చు]దేవయాని ఖోబ్రగడే ఇటలీలోని రోమ్‌లో లూయిస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా ప్రొఫెసర్ అయిన ఆకాష్ సింగ్ రాథోడ్ అనే అమెరికన్ పౌరుడిని వివాహం చేసుకుంది.[19][20][21][22][23] రాథోడ్ భారతీయ దౌత్యవేత్తను వివాహం చేసుకున్న విదేశీ జాతీయుడు కాబట్టి, భారరతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.[24]
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె తండ్రి ఉత్తమ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో అధికారి.
వివాదాలు
[మార్చు]దేవయాని ఖోబ్రగడే వీసా మోసం సంఘటనతో పాటు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్‌కు సంబంధించి ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడేతో ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Father meets Shinde". Zee News. Retrieved 17 December 2013.
- ↑ "Welcome to Embassy of India, Phnom Penh, Cambodia". embindpp.gov.in. Retrieved 2021-10-12.
- ↑ "Controversial diplomat Devyani Khobragade writes her first book 'The White Sari'". Indian Express. Retrieved 18 Dec 2016.
- ↑ Gowen, Annie (20 December 2013). "Who is Devyani Khobragade, the Indian diplomat at the center of the firestorm?". The Washington Post. Retrieved 7 January 2014.
- ↑ Khobragade, Uttam (13 January 2014). "My daughter's return". NDTV. Retrieved 13 January 2014.
- ↑ "ACB books Bhujbal son for land fraud | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-14. Retrieved 2017-08-29.
- ↑ "Adarsh Scam: Revoke membership of 22 flat owners, CBI tells government again". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-16. Retrieved 2017-08-29.
- ↑ "Sweltering summer just got worse - Mumbai Mirror -". Mumbai Mirror. Retrieved 2017-08-29.
- ↑ "Who is Devyani Khobragade?". The Times of India. 19 December 2013. Archived from the original on 22 December 2013. Retrieved 27 December 2013.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Gowen, Annie (20 December 2013). "Who is Devyani Khobragade, the Indian diplomat at the center of the firestorm?". The Washington Post. Retrieved 7 January 2014.
- ↑ "Acting Consul General of India in New York, Dr Devyani Khobragade Holds Conversation on Women's Rights and the Influence of Demographics in India with New York Young Leaders' Program". Australian Consulate-General, New York. 30 April 2013. Retrieved 7 January 2014.
- ↑ Roy, Shubhajit (20 January 2014). "Devyani likely to head MEA's overseas projects department". Indian Express. Retrieved 20 January 2014.
- ↑ "Government takes disciplinary, administrative action against Indian diplomat Devyani Khobragade". Press Trust of India. Daily News and Analysis. 20 December 2014. Retrieved 22 July 2015.
- ↑ "Devyani Khobragade reinstated as director in MEA". Indo Asian News Service. Zee News. 3 July 2015. Retrieved 22 July 2015.
- ↑ Smriti Kak Ramachandran (3 July 2015). "Khobragade reinstated in new division". The Hindu. Retrieved 22 July 2015.
- ↑ "Back from the wilderness, Devyani to serve God's own country". Times News Network. Times of India. 31 July 2015. Retrieved 31 July 2015.
- ↑ "Devyani Khobragade, 2012 Rolls-Royce Scholar, Chevening Rolls-Royce Science and Innovation Leadership Programme". UK Government, Foreign and Commonwealth Office. 2012. Archived from the original on 6 March 2014. Retrieved 7 January 2014.
- ↑ "Devyani Khobragade Appointed India's Next Ambassador To Cambodia". NDTV. Retrieved 17 Oct 2020.
- ↑ "More skeletons tumble out of Devyani Khobragade's cupboard". Firstpost.com. Retrieved 28 February 2014.
- ↑ "2014 Sydney International Wine Competition". Winemedia.com.au. Archived from the original on 5 March 2014. Retrieved 3 March 2014.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Devyani case resolution complicated by marriage to US-born 'wine philosopher'". The Times of India. 22 December 2013. Retrieved 3 March 2014.
- ↑ "The Complete Indian Wine Guide Review". Indianwine.com. 20 May 2006. Archived from the original on 30 జనవరి 2013. Retrieved 3 March 2014.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Keith Stewart (5 July 2013). "Sydney International Competition entries open". Winetech. Archived from the original on 1 మార్చి 2014. Retrieved 3 March 2014.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Roy, Shubhajit (13 March 2014). "Trouble for Devyani Khobragade as govt finds daughters have both US, Indian passports". The Indian Express. Retrieved 13 March 2014.