Jump to content

దేవేంద్ర నాగ్‌పాల్

వికీపీడియా నుండి
దేవేంద్ర నాగ్‌పాల్

పదవీ కాలం
2009 - 2014
ముందు హరీష్ నాగ్‌పాల్
తరువాత కన్వర్ సింగ్ తన్వర్
నియోజకవర్గం అమ్రోహా[1]

ఎమ్మెల్యే
పదవీ కాలం
2002 - 2007
ముందు రిఫాకత్ హుస్సేన్
తరువాత ఫర్హత్ హసన్
నియోజకవర్గం హసన్‌పూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1971-01-01) 1971 జనవరి 1 (వయసు 53)[1]
మొరాదాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్
నివాసం ధనౌరా & న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి కెజికె పిజి కళాశాల, మొరాదాబాద్ .
వృత్తి సామాజిక కార్యకర్త , రాజకీయ నాయకుడు .

దేవేంద్ర నాగ్‌పాల్ ( జననం 1 జనవరి 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దేవేంద్ర నాగ్‌పాల్ రాజకీయాల పట్ల ఆసక్తితో వచ్చి జిల్లా పంచాయితీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2002లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హసన్‌పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దేవేంద్ర నాగ్‌పాల్ ఆ తరువాత రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలో చేరి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమ్రోహా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పరిశ్రమపై కమిటీ & పిటిషన్లపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

దేవేంద్ర నాగ్‌పాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జూన్ 2013లో నాగ్‌పాల్‌తో పాటు మరో ఎంపీ సారిక దేవేంద్ర సింగ్ బఘేల్‌ను పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నుండి బహిష్కరించాడు.[2][3] ఆయన ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2016లో పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నౌగవాన్ సాదత్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 7 January 2014. Retrieved 7 January 2014.
  2. The Indian Express (29 March 2013). "Another RLD MP all set to join SP" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. India TV News (19 July 2013). "RLD suspends two party MPs" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  4. The Economic Times (11 February 2022). "UP polls: Richest candidate in 2nd phase has assets worth Rs 296 cr, poorest just Rs 6,700". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.