ధనుపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధనుపురం గ్రామం శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1] ఈ ఊరుకు ఒక గ్రామపంచాయితీ ఉంది. ఈ ఊరు శ్రీకాకుళం నుండి పాతపట్నము వచ్చే మార్గమద్యలో వున్నప్పటికీ ఈ గ్రామానికి మండల స్థాయిలలో సరైన గుర్తింపు లేదు. ఈ ఊరికి సమీపంలో వున్న తంప గ్రామంలో ఒక భాగంగా ఈ ఊరిని రెవెన్యూ పరంగా గుర్తించడం విశేషం. వై.యస్.షర్మిల పాదయాత్రలో 3000కి.మీ మైలురాయి ఈ ఊరికి చేరడంతోనే పూర్తికావడం మరొక విశేషం. ఈ గ్రామంలో కొన్ని భూములు మహేంద్రతనయ నది ఒడ్డున ఉండుట చేత సారవంతమైనవి. మిగిలిన భూములుకు పొగడవల్లి చెరువులోని నీరు ఆధారం. ఈ గ్రామంలో సుమారు 500 ఇల్లు ఉన్నాయి. ఈ గ్రామం పాతపట్నం శాసనసభ నియోజకవర్గానికి చెందింది.

మూలాలు

[మార్చు]
  1. "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. Retrieved 2022-03-11.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ధనుపురం&oldid=3647171" నుండి వెలికితీశారు