ధునుచి నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాంప్రదాయ ధునుచి నృత్యం
మంగళ హారతి నిర్వహించడానికి ఉపయోగించే ఇత్తడి ధునుచి

ధునుచి నృత్యం అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా దుర్గా పూజలో ప్రత్యేకంగా ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్య రూపం.[1]

శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి నుంచి అమ్మవారి నిమజ్జనం దాకా సుమారు నాలుగు రోజుల పాటు బెంగాలీ సంప్రదాయ ధునుచి నృత్యాలు కొనసాగుతాయి.[2] 2023లో, ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో ఏర్పాటు చేసిన దుర్గా మంటపాన్ని సందర్శించిన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ధునుచి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. నోటితో నిప్పుల కుంపటిని పట్టుకుని ఆయన నర్తించిన తీరు దుర్గా మంటపం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.[3]

ప్రాముఖ్యత[మార్చు]

ఈ నృత్యం బెంగాలీ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఇది దుర్గాదేవి తన బలాన్ని పెంచుకోవడానికి స్వయంగా ప్రదర్శించిందని నమ్ముతారు.ఇది రాక్షస ధోరణులను పారద్రోలుతుందని, మనస్సును ఉత్తేజపరుస్తుందని భక్తుల విశ్వాసం.[2]

ధునో (బెంగాలీ: ধুনো) అనేది సుగంధ ద్రవ్యం కాగా, ధునుచి అనేది దేవతలకు ధూపం సమర్పించేది.[4][5][6]

ధునుచి (పట్టుకోవడానికి వీలుగా ఉండే ప్రమిద, మట్టిపాత్ర)లో బొగ్గులు కాని, కొబ్బరిపీచు కాని నిప్పు రగిలించి, దానిపై సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యాలు వేయడం ద్వారా ధూపం సిద్ధమవుతుంది. దుర్గా పూజ సమయంలో, ధక్ వాయించడంతో పాటుగా ధునుచితో నృత్యం చేయడం సర్వసాధారణం. అనేక పూజా కార్యక్రమాలలో భాగంగా పోటీలను కూడా నిర్వహిస్తారు. కళాకారులు ఒకటి, రెండు, మూడు ఇలా ధునుచీలతో ధునుచి నృత్యం ప్రదర్శిస్తారు. ధునుచి హారతిని "ధూప్ హారతి" అని కూడా అంటారు.

మూలాలు[మార్చు]

  1. "Navratri: దాండియా.. ధునుచి.. ఘూమర్.. అమ్మకు 'నృత్య' నీరాజనం | popular dance forms for this navratri and dussehra in telugu". web.archive.org. 2023-10-22. Archived from the original on 2023-10-22. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Navratri: దాండియా.. ధునుచి.. ఘూమర్.. అమ్మకు 'నృత్య' నీరాజనం | popular dance forms for this navratri and dussehra in telugu". web.archive.org. 2023-10-22. Archived from the original on 2023-10-22. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Eric Garcetti: దుర్గమ్మ మండపానికి అమెరికా రాయబారి.. 'ధునుచి' నృత్యం చేసిన గార్సెట్టి | us ambassador eric garcetti goes pandal hopping in delhis cr park during durga pooja". web.archive.org. 2023-10-22. Archived from the original on 2023-10-22. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Janardhanan, Dr Major Nalini (23 July 2023). BLESSINGS GALORE (in ఇంగ్లీష్). DeepMisti Publication. p. 80. ISBN 978-81-19108-77-0.
  5. Shukla-Bhatt, Neelima (7 March 2023). "Dhunuchi"+origin+Bengal&pg=PT123 Hinduism: The Basics. Taylor & Francis. p. 123. ISBN 978-1-315-30333-8.
  6. Mukhopadhyaya, Trailokyanatha (1894). Monograph on the Brass and Copper Manufactures of Bengal (in ఇంగ్లీష్). Office of the Superintendent, Government Printing. p. 2.