ధ్వని గౌతమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధ్వని గౌతమ్
జననం (1985-07-22) 1985 జూలై 22 (వయసు 38)
విద్యాసంస్థది ఏషియన్ స్కూల్
మార్వా స్టూడియోస్ నోయిడా
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
ధ్వని గౌతమ్ ఫిల్మ్స్

ధ్వని గౌతమ్, గుజరాత్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత.[1][2][3] గుజరాత్, బాలీవుడ్‌ సినిమారంగాలలో పనిచేస్తున్నాడు.

జననం[మార్చు]

ధ్వని గౌతమ్ 1985, జూలై 22న గుజరాత్‌లో జన్మించాడు. ది ఏషియన్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను, మార్వా స్టూడియోస్ నోయిడా నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీని పూర్తిచేసాడు.

సినిమారంగం[మార్చు]

తన 13 సంవత్సరాల వయస్సుతో యష్ చోప్రా తీసిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చూసినప్పుడు సినిమా దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినందున సినిమారంగంలో తన కెరీర్‌ను కొనసాగించడానికి ముందు న్యూఢిల్లీలోకొంతకాలం రేడియో జాకీగా పనిచేశాడు. సినిమారంగం కోసం ముంబైకి మారాడు.

బా బహూ ఔర్ బేబీ అనే నాటకానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఆ తర్వాత మరో మూడు సీరియల్స్‌కి పనిచేశాడు. సన్నీ డియోల్ నటించిన హీరోస్, బాబీ డియోల్ నటించిన నన్హే జైసల్మేర్ సినిమాలకు పనిచేశాడు. దర్శకత్వం, రచనలో అనుభవం సంపాదించిన తరువాత, పంజాబీ సినిమారంగానికి పనిచేసాడు.

2015లో తన స్వంత సినిమా రొమాన్స్ కాంప్లికేటెడ్‌పై పనిచేయడం ప్రారంభించాడు, ఇది అతని దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా.[4] విదేశాలలో చిత్రీకరించబడిన తొలి గుజరాతీ సినిమా.[5] ఆ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌లో కూడా నటించాడు.[6]

2018లో గ్రేట్ గుజరాతీ కుకింగ్ పోటీ పేరుతో కుకింగ్ షోతో టెలివిజన్‌లోకి మళ్ళీ వచ్చాడు.[7]

సినిమాలు[మార్చు]

సహాయ దర్శకుడు[మార్చు]

సంవత్సరం సినిమా
2007 హ్యాట్సాఫ్ ప్రొడక్షన్స్
2008 సాగర్ ఆర్ట్స్ వడోదర
2008 హీరోస్

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు నటుడు అసోసియేట్ ప్రొడ్యూసర్ స్క్రీన్ ప్లే రచయిత
2014 ది లాస్ట్ డాన్ Yes
2016 రొమాన్స్ కాంప్లికేటెడ్‌ Yes Yes Yes Yes
2016 టు టో గయో Yes Yes Yes Yes
2018 మిడ్ నైట్ విత్ మెంకా Yes
2019 ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్[8] Yes Yes Yes Yes
2020 గోల్కేరి Yes
2022 హూన్ తారీ హీర్[9] Yes Yes Yes Yes
2023 డేరో[10] Yes Yes Yes Yes
2023 శుభ్ సాంజ్[11] Yes Yes Yes Yes
2023 ది స్టోరీ ఆఫ్ పటేల్ వర్సెస్ పాట్రిక్ Yes Yes Yes Yes
2023 కేసరియా Yes Yes Yes Yes
2023 లవ్ అత్రాంగి Yes Yes Yes Yes

టెలివిజన్[మార్చు]

సంవత్సరం సిరీస్ సీజన్ దర్శకుడు నిర్మాత నెట్‌వర్క్/ప్లాట్‌ఫారమ్ ఇతర వివరాలు
2013 జీవిత వార్త 1 Yes Yes విటివి-గుజరాతి సీరియల్
2017 మిస్టర్ డి షో[12] 1 Yes Yes జిటిపిఎల్ చాట్ షో & హోస్ట్
2018 గ్రేట్ గుజరాత్ కుకింగ్[13] 1 జిటిపిఎల్ కుకింగ్ షో & హోస్ట్
2019 మిస్టర్ డి షో - గెట్ ఫన్నీ విత్ ధ్వని[14] 2 Yes Yes షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ చాట్ షో & హోస్ట్
2019 గ్రేట్ గుజరాత్ కుకింగ్[15] 2 న్యూస్18 గుజరాతీ కుకింగ్ షో & హోస్ట్

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం పాట దర్శకుడు నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత
2021 వాల్మియా 2.0 Yes Yes Yes
2021 పరదేశీయ Yes Yes Yes
2021 హవా కర్దా Yes

మూలాలు[మార్చు]

  1. Ahmedabad, The Times Of India (8 September 2016). "City newbies to dazzle the Gujarati silver screen". No. Ahmedabad Times. The Times Group. Retrieved 2023-07-27.
  2. Gujarat, Desh (15 March 2016). "Darshan Raval becomes highest paid actor in Gujarati film industry". No. Online. News Agencies. Retrieved 2023-07-27.
  3. Patel, Kalgi (7 September 2014). "RomCom uses social networking site to cast actors". No. Times Of India Ahmedabad. Times News Network. Retrieved 2023-07-27.
  4. TNN, Times News Network (8 February 2015). "The new-age directors of Gujarati cinema". No. Indiatimes. The Times Group. Retrieved 2023-07-27.
  5. Patel, Kalgi. "Past few months have been great: Dhwani". The Times of India. Retrieved 2023-07-27.
  6. Iyer, Shreya (5 January 2016). "Playing a negative character is always exciting: Dhwani Gautam". No. Times Of India. TNN. Retrieved 2023-07-27.
  7. "Dhwani Gautam makes a comeback to small screen! - Times of India". The Times of India. Retrieved 2023-07-27.
  8. "Order Order Out of Order Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". The Times of India. Retrieved 2023-07-27.
  9. Today, India. "Dhwani Gautam to start shooting on his dream project 'Hoon Tari Heer' soon - Exclusive!". The Times of India. Retrieved 2023-07-27.
  10. Today, India. "'Dayro': Dhwani Gautam announces his next; poster out!". The Times of India. Retrieved 2023-07-27.
  11. Today, India. "Dhwani Gautam completes his next romantic venture 'Shubh Saanj', watch the video!". The Times of India. Retrieved 2023-07-27.
  12. "Dhwani Gautam makes a comeback to small screen! - Times of India". The Times of India. Retrieved 2023-07-27.
  13. "Dhwani Gautam makes a comeback to small screen! - Times of India". The Times of India. Retrieved 2023-07-27.
  14. "ShemarooMe Launches New Gujarati Chat Show With Dhwani Gautam". No. Mumbai. mumbailive.com. Retrieved 2023-07-27.
  15. "Dhwani Gautam makes a comeback to small screen! - Times of India". The Times of India. Retrieved 2023-07-27.

బయటి లింకులు[మార్చు]