Jump to content

నందా ప్రస్తీ

వికీపీడియా నుండి
నందా ప్రస్తీ
జననంనందా ప్రస్తీ
ఒడిశా జాజ్‌పూర్‌
ఇతర పేర్లునందా మాస్టర్
వృత్తిఉపాధ్యాయుడు

జీవిత విశేషాలు

[మార్చు]

నందా సర్ అని పిలవబడే అతను ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కాంతిరా గ్రామంలో పిల్లలకు పెద్దలకు ఉచిత విద్యను బోధించాడు.నందా తల్లిదండ్రుల వ్యవసాయం చేసేవారు.కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా 7వ తరగతి వరకు చదువుకున్నాడు. స్వాతంత్య్రానికి ముందు గ్రామంలో అక్షరాస్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది.తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో పిల్లలకు ఉచితంగా బోధిస్తున్నాడు.[1][2]

డబ్బు లేని విద్య

[మార్చు]

కాంతిరా గ్రామంలో విద్యపై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల చదువు పట్ల అభిరుచి చూపించేవారు కాదు.వారి పిల్లలను చదువుకు దూరంగా ఉండేవారు. వాళ్లకి విద్య పై అభిరుచి కలిగించి ఊరిలో బడి లేకపోవడంతో చెట్టుకింద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టడు.నందా చదువుకునే సమయంలో, జ్ఞానాన్ని పంచుకోవడం ఎవరికైనా సహాయం చేయడం లాంటిదని, అందువల్ల చదువు కోసం ఎవరి నుండి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా బోధించాడు. ఉదయం పిల్లలకు పెద్దలకు సాయంత్రం బోధించేవాడు.ఇప్పటికీ కొనసాగుతోంది. పిల్లలు ఒడియాలో అక్షరాలు కొద్దిగా గణితాలు చదివేవారు. సంతకం పెట్టడానికి పెద్దలు తమ పేర్లు రాయడం నేర్చుకోవడానికి నందా మాస్టర్ దగ్గరకు వచ్చేవారు. ఇప్పటి వరకు బోధన కోసం ఎలాంటి ప్రభుత్వ సహాయం తీసుకోకుండా బోధించారు.[3][4]

పద్మ శ్రీ అవార్డు

[మార్చు]

2021 న‌వంబ‌ర్ 9వ తేదీన‌ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు.విద్య కోసం చేసిన కృషికి నందా ప్రస్తీకి పద్మశ్రీని ప్రదానం చేశారు.ఒడిశాలోని జాజ్‌పూర్‌లో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలకు ఉచిత విద్యను అందించిన 102 ఏళ్ల నందా సర్, రాష్ట్రపతిని ఆశీర్వదిస్తున్నారు. అని భారత రాష్ట్రపతి ట్విటర్‌ లో ట్వీట్ చేశారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Teacher for 7 decades, 102-year-old class 7 pass out is Padma Shri winner". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-01-26. Retrieved 2021-11-12.
  2. "98-year-old Nanda Kishore Prusty's unstoppable mission of literacy". The New Indian Express. Retrieved 2021-11-12.
  3. "నందా సర్ ఎవరూ? పద్మశ్రీ అవార్డు ఎందుకు వచ్చింది". News24 English (in హిందీ). 2021-11-10. Archived from the original on 2021-11-11. Retrieved 2021-11-11.
  4. "Odisha teacher Nanda Prusty scores a century in his age and 2021 Padma Awards". The New Indian Express. Retrieved 2021-11-11.
  5. "103 Yrs Old Shri Nanda Prusty Teachers Gives Free Education to Kids since 7 decades - Padma Shri Award 2021". eOdisha.org - latest Odisha News - Business - Culture -Art - Travel (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-25. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-12.

వెలుపలి లింకులు

[మార్చు]