నందీశ్వర ఆలయం బాది
నందీశ్వర ఆలయం బాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బాది గ్రామ శివారులో ఉంది. వందల ఏండ్ల చరిత్ర గలిగిన ఈ నందీశ్వర ఆలయం శాతవాహనుల కాలానికి సంబందించింది.ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు[1][2][3].
నందీశ్వర ఆలయం -బాది | |
---|---|
పేరు | |
ప్రధాన పేరు : | నందీశ్వర ఆలయం బాది |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ |
ప్రదేశం: | బేల, బాది |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నందీశ్వర |
ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 16 వ శతాబ్ధంలో |
సృష్టికర్త: | శాతవాహనులు |
చరిత్ర
[మార్చు]బేల మండలం బాది గ్రామంలో కొలువైన నందీశ్వర ఆలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది[4]. ఇది అత్యంత పురాతనమైన ఆలయం.ఈ ఆలయాన్ని శాతవాహనులు క్రీ,శ 16 వ శతాబ్ధంలో నిర్మించి ఉంటారని అంటారు. ఇచట ఆదివాసీ గోండు తెగ లోని జుగ్నక్ గోత్రం వారు పూర్వం నుండే పూజలు నిర్వహించడం ఆనవాయితి.మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఐదు రోజుల పాటు పూజాలు జరుగుతాయి.పరమేశ్వరుడే ఇలా పరీక్షించి నందీశ్వరుడి గా అవతారంగా నిలిచిపోయాడని భక్తుల అభిప్రాయం.
ఆలయ కథ
[మార్చు]బాది గ్రామ శివారులో బాది అను పేరు గల ఒక ఆదివాసీ గోండు రాజు తన పొలంలో చెరుకు పంటను పండించేవారట. పంటల కోసం పొలాన్ని ఆనుకొని ఒక దొడ్డి నిర్మించారట, ఒక రోజు ఆ పొలంలో చెరుకు మేస్తున్న ఎద్దు పొలంలో పంటలను నాశనం చేస్తూ కన్పిందట. ఆ రాజు ఎలాగైనా ఎద్దు( నంది)ను పట్టి బంధించాలని అనుకొని కాపలగా ఉన్న వ్యక్తులను పిలిచి చెప్పిడంతో వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసెలోపె ఆ ఎద్దు మాయమయ్యేదట. రోజురోజుకు పొలంలో ఉన్న చెరుకు కూడా మాయమవ్వడంతో ఆశ్చర్యం చేందిన పొలం యజమాని ఆ వ్యక్తులను ప్రణాళిక ప్రకారం కాపలా పెటించాడట. అలవాటు ప్రకారం మళ్ళీ పొలంలో వచ్చిన ఎద్దును పారిపోకుండా,మాయమవ్వకుండా ఆ వ్యక్తులు దాన్ని కొట్టగా కాలు విరిగిందట వాళ్ళు ఆ ఎద్దును మోసుకెళ్ళి పడుకోబెట్టి అక్కడి నాటు వైద్యుడు పసరాకుతో కట్టుకట్టగా అందరు చూస్తుండగానే ఆ నంది (ఎద్దు) మాయమైపోయిందట. ఆ ప్రాంతమంతట వీళ్ళు పరిశీలించగా అది శిలా రూపంలో నిలిచిపోయిందట. అలా బాది గ్రామంలో నిలిచిపోయిన నందీశ్వరుణ్ణి భక్తులు పూజలు చెయడం ప్రారంభించారని అచట ఉన్న ఆదివాసీలు చెబుతుంటారు.
విశేషాలు
[మార్చు]గొండు ఆదివాసీలు తెగలో జుగ్నాక్ గోత్రం వారు మాత్రమే ఆలయంలో పూజలు చేయడం విశేషం.
జాతర
[మార్చు]బేల మండలం బాది గ్రామంలో అతి పురాతన నందీశ్వర ఆలయంలో మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఐదు రోజుల పాటు ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది[5].మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజు గోండు ఆదివాసీలలో జుగ్నాక్ గోత్రం వారు ఆలయంలో ప్రత్యేక అభీషేకాలు ,పూజలు నిర్వహించి జాతర ను ప్రారంభిస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తారు.
చిత్రమాలిక
[మార్చు]ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఈ నందీశ్వర ఆలయాన్ని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాదు జిల్లాల నుండి వచ్చే భక్తులు ముందుగా ఆదిలాబాదు చేరుకోవాలి .ఆదిలాబాదు నుండి 31 కి.మీ దూరంలో మండల కేంద్రమైన బేల నుండి 08 కి.మీ.దూరంలో బాది గ్రామం ఉంటుంది .ఆదిలాబాదు నుండి సిర్సన్న వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి ఆటోలలో చేరుకో వచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-03-01). "శివపూజకు వేళాయె". www.ntnews.com. Retrieved 2024-07-22.
- ↑ "Adilabad District Temples of Lord Shiva of Telengana - అదిలాబాద్ శివ గుడి". shaivam.org. Retrieved 2024-07-22.
- ↑ telugu, NT News (2022-03-03). "ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు". www.ntnews.com. Retrieved 2024-07-24.
- ↑ Sanagala, Naveen (2007-04-19). "Sri Nandi Mandir, Badi". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-07-22.
- ↑ telugu, NT News (2022-03-02). "ఓం నమః శివాయః". www.ntnews.com. Retrieved 2024-07-24.