నంబూరి శంకర్ రావు
| నంబూరు శంకరరావు | |||
ఎమ్మెల్యే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2019 - 3 జూన్ 2024 | |||
| తరువాత | భాష్యం ప్రవీణ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పెదకూరపాడు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1968 పెదపరిమి గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | నాగేశ్వరరావు, లక్ష్మీకాంతమ‍్మ[1] | ||
నంబూరి శంకర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]నంబూరు శంకరరావు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం, పెదపరిమి గ్రామంలో నాగేశ్వరరావు, లక్ష్మీకాంతమ‍్మ దంపతులకు జన్మించాడు. ఆయన నర్సరావుపేటలోని రఘురామయ్య కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నంబూరు శంకరరావు 2018లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ పై 14104 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చేతిలో 21089 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ HMTV (7 December 2019). "వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. ఫోన్ లో పరామర్శించిన సీఎం". ఒరిజినల్ నుండి 6 జనవరి 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 January 2022.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". ఒరిజినల్ నుండి 2 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
- ↑ Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". ఒరిజినల్ నుండి 8 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pedakurapadu". the original నుండి 27 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 June 2024.