Jump to content

కొమ్మాలపాటి శ్రీధర్

వికీపీడియా నుండి
కొమ్మాలపాటి శ్రీధర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2019
ముందు కన్నా లక్ష్మీనారాయణ
తరువాత నంబూరి శంకర్ రావు
నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
పెదకూరపాడు గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మయ్య
జీవిత భాగస్వామి మాధవి లతా
సంతానం సృజన & సాయి సుధాకర్

కొమ్మాలపాటి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పెదకూరపాడు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కొమ్మాలపాటి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పెదకూరపాడులో జన్మించాడు. ఆయన నారాకోడూరులోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి, సత్తెనపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, గుంటూరులోని ఏ.సి కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నూర్జహాన్ పై 9878 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 9196 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

కొమ్మాలపాటి శ్రీధర్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్ రావు చేతిలో 14104 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. 10TV (29 October 2020). "రాజకీయ ప్రయోజనం కోసం వినుకొండ వియ్యంకుల వ్యూహం" (in telugu). Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)