నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

వికీపీడియా నుండి
(నవజ్యోత్ సింగ్ సిద్దూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ
నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ


పంజాబ్ పీసీసీ అధ్యక్ష్యుడు
పదవీ కాలం
18 జులై 2021 – 28 సెప్టెంబర్ 2021
ముందు సునీల్ జఖర్
తరువాత TBD

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 మార్చి 2017
ముందు నవజోత్ కౌర్ సింధు
నియోజకవర్గం అమృత్‌సర్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

అమరిందర్ సింగ్ 2వ మంత్రివర్గంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
పదవీ కాలం
16 మార్చి 2017 – 20 జులై 2019
తరువాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
25 ఏప్రిల్ 2016 – 18 జులై 2016
ముందు అశోక్ శేఖర్ గంగూలీ
తరువాత రూపా గంగూలీ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2014
ముందు రఘునందన్ లాల్ భాటియా
తరువాత అమరిందర్ సింగ్
నియోజకవర్గం అమృత్‌సర్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-10-20) 1963 అక్టోబరు 20 (వయసు 61)
పటియాలా, పంజాబ్,భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ (2017– ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
(2004–2016)
జీవిత భాగస్వామి నవజ్యోత్‌ కౌర్ సింధు
సంతానం కరణ్ సిద్ధూ (కుమారుడు)

రబియా సిద్ధూ (కుమార్తె)

నివాసం హోలీ సిటీ, అమృత్‌సర్
వృత్తి రాజకీయ నాయకుడు , క్రికెటర్

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా, పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన హిందీలో ముఝుసే షాదీ క‌రోగీ మ‌రియు ఏబీసీడీ 2 సినిమాల‌లో, మేరా పిండా పంజాబీ సినిమాలో న‌టించాడు. సిద్ధూ ప‌లు టెలివిజన్ కామెడీ షోల‌లో జ‌డ్జిగా ఉంటూ కామెడీ నైట్స్ విత్ క‌పిల్ షోలో శాశ్వ‌త అతిథిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 1963 అక్టోబరు 20లో పంజాబ్ రాష్ట్రం, పటియాలాలో జన్మించాడు. ఆయన పంజాబ్ యూనివర్సిటీ నుండి తన విద్యాభాస్యం పూర్తి చేశాడు.

క్రీడా జీవితం

[మార్చు]

సిద్ధూ 1981లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి 1983లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ఆయన మొత్తం 51 టెస్టులు మ‌రియు 136 వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడాడు. సిద్ధూ డిసెంబ‌రు 1999లో అన్ని ర‌కాల క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

క్రికెటర్ గా ఉత్తమ ప్రదర్శనలు

[మార్చు]
బ్యాట్టింగ్
స్కోర్ జట్ల మధ్య వేదిక సంవత్సరం
టెస్ట్ క్రికెట్ 201 వెస్ట్ ఇండీస్ v భారత్ క్వీన్స్ పార్క్, ఓవల్, పోర్ట్ అఫ్ స్పెయిన్ 1997[1]
వన్ డే క్రికెట్ 134* భారత్ v ఇంగ్లాండ్ కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం, గ్వాలియర్ 1993[1]
ఫస్ట్ - క్లాస్ క్రికెట్ 286 జమైకా v భారత్ సబీనా పార్క్, కింగ్స్ టన్ 1989[1]
ఏ క్రికెట్ 139 పంజాబ్ v జమ్మూ కాశ్మీర్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, అమృత్‌స‌ర్ 1996[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అమృత్‌స‌ర్ లోక్‌స‌భ‌ స్థానం 2004 నుండి 2014 వరకు ఎంపీగా పనిచేశాడు. ఆయన బీజేపీ నుండి 2016 ఏప్రిల్ 28న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి 2016 జూలై 18న రాజీనామా చేశాడు. సిద్ధూ బీజేపీకి రాజీనామా చేసి 2017 జనవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో అమృత్‌సర్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అమరిందర్ సింగ్ మంత్రివర్గంలో ప‌ర్యాట‌క, సాంసృతిక వ్య‌వ‌హారాలు మ‌రియు మ్యూజియంల మంత్రిగా పనిచేసి 2019 జూన్ 10న మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[3]

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 2021 జూలై 18న పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ( పీసీసీ) అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5] ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి 2021 సెప్టెంబరు 28న రాజీనామా చేశాడు.[6] ఆయన పీసీసీ అధ్యక్షుడిగా జూలై 23న బాధ్యతలు చేపట్టి కేవలం 72 రోజులే పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Menon, Mohandas (13 December 1999). "Rediff On The NeT: Navjot Singh Sidhu fact file". Rediff.com. Archived from the original on 4 June 2000. Retrieved 7 August 2018.
  2. "Ranji One-Day North Zone League, 1996/97, Punjab v Jammu & Kashmir". ESPN Cricinfo. Retrieved 31 July 2017.
  3. The Hindu (14 July 2019). "Navjot Singh Sidhu resigns from Punjab Cabinet" (in Indian English). Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  4. Sakshi (19 July 2021). "పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  5. NTV (18 July 2021). "పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
  6. Eenadu (28 September 2021). "Sidhu: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ రాజీనామా". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.