అమరిందర్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరిందర్ సింగ్
అమరిందర్ సింగ్


పంజాబ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మార్చి 16
గవర్నరు వి.పి. సింగ్
ముందు ప్రకాష్ సింగ్ బాదల్
పదవీ కాలం
2002 ఫిబ్రవరి 26 – 2007 మార్చి 1
గవర్నరు అఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్ (అదనపు బాధ్యత)
సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్
ముందు ప్రకాష్ సింగ్ బాదల్
తరువాత ప్రకాష్ సింగ్ బాదల్

వ్యక్తిగత వివరాలు

జననం (1942-03-11) 1942 మార్చి 11 (వయసు 82)
పటియాలా, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పంజాబ్, భారతదేశం)
రాజకీయ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు శిరోమణి అకాలీ దళ్
(1984–92)
భారత జాతీయ కాంగ్రెస్ (1980–84; 1998–ప్రస్తుతం)
తల్లిదండ్రులు యాదవీంద్ర సింగ్
జీవిత భాగస్వామి ప్రేణీత్ కౌర్
సంతానం 2
వెబ్‌సైటు www.captainamarindersingh.com

కెప్టెన్ అమరిందర్ సింగ్(జననం 1942 మార్చి 11) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మిలటరీ చరిత్రకారుడు, రచయిత ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అమరిందర్ సింగ్ ఫుల్కియాన్ రాజవంశానికి చెందిన మహారాజ సర్ యదావీంద్ర సింగ్ మహారాణి మొహిందర్ కౌర్ కుమారుడు.[3] డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్‌లో విద్యను అభ్యసించాడు అంతకు ముందు సనవర్‌లోని లోరెటో కాన్వెంట్, తారా హాల్, సిమ్లా ఇంకా లారెన్స్ స్కూల్‌కు హాజరయ్యాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇతని భార్య ప్రేణీత్ కౌర్ లోక్ సభ సభ్యురాలిగా పని చేసింది, 2009 నుండి 2012 వరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది.[4]

కెరీర్

[మార్చు]

ఆర్మీలో

[మార్చు]

సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఆర్మీలో చేరాడు. 1963 నుండి 1966 వరకు భారత ఆర్మీ సిఖ్ రెజిమెంటులో పనిచేశాడు. డిసెంబర్ 1964 నుండి జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వెస్ట్రన్ కమాండ్లో, ఆ తరువాత లెఫ్టినెంట్ జనరల్గా కూడా పనిచేశాడు. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు.

రాజకీయంలో

[మార్చు]

అమరిందర్ సింగ్ చిన్ననాటి స్నేహితుడైన రాజీవ్ గాంధీ ద్వారా సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1980లో సింగ్ మొట్టమొదటిసారి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగే సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గా లోక్సభ కి రాజీనామా చేశాడు . ఆ తర్వాత శిరోమణి ఆకలి దళ్ పార్టీలో చేరి రాష్ట్ర వ్యవసాయ, పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

1992లో ఆకలి దళ్ పార్టీతో విభేదాలు ఏర్పడి శిరోమణి అకాలీ దళ్ (పాంథిక్) అనే ఇంకొక  గ్రూప్ ని ఏర్పరిచాడు, ఆ తర్వాత 1998 లో ఈ పార్టీ  కాంగ్రెస్లో విలీనం చేయబడింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1999 నుండి 2002 వరకు ఆ తర్వాత 2010 నుంచి 2013 వరకు మళ్ళి 2017 నుండి 2017 వరకు బాధ్యతలు నిర్వహించాడు. 2002లో మొదటిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

2015 నవంబర్ 27న పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సింగ్ 2017 మార్చిలో జరిగిన  రాష్ట్ర  శాసనసభ ఎన్నికల  ప్రచారంలో నాయకత్వం వహించి పార్టీని గెలిపించాడు.

2017 మార్చి 16 న పంజాబ్ రాష్ట్ర 26 ముఖ్యమంత్రిగా చండీగర్ లో అమరిందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన సెప్టెంబర్ 19, 2021న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.[5]

అమరిందర్ సింగ్ 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పటియాలా నియోజకవర్గం నుండి పంజాబ్ లోక్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 19, 797 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Amarinder Singh sworn in as Punjab CM". The Hindu (in Indian English). Special Correspondent. 2017-03-16. ISSN 0971-751X. Retrieved 2021-06-27.{{cite news}}: CS1 maint: others (link)
  2. DelhiMarch 11, India Today Web Desk New; March 11, 2017UPDATED:; Ist, 2017 21:01. "Punjab election results 2017: Full list of winners". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. Singh, Khushwant (2017-02-15). Captain Amarinder Singh: The People's Maharaja: An Authorized Biography (in ఇంగ్లీష్). Hay House, Inc. ISBN 978-93-85827-44-0.
  4. "Seven Doscos in 15th Lok Sabha". web.archive.org. 2009-06-03. Archived from the original on 2009-06-03. Retrieved 2021-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Sakshi (19 September 2021). "పంజాబ్‌ సీఎం అమరీందర్‌ రాజీనామా". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  6. Andhra Jyothy (10 March 2022). "కెప్టెన్ ఓటమి... కలిసి రాని కొత్త పార్టీ". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  7. TV5 News (10 March 2022). "అమరీందర్ సింగ్ ఓటమి..!" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)