నవీన షేక్
(నవీన. ఎస్ నుండి దారిమార్పు చెందింది)
నవీన షేక్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
తల్లిదండ్రులు | ఎస్. మహబూబ్ సాహెబ్, ఎస్. ఖాజాబి, |
నవీన షేక్ (జులై 5, 1979) ప్రముఖ రంగస్థల, సినీ, టివీ నటి.
జననం
[మార్చు]ఈవిడ 1979, జులై 5 వ తేదిన శ్రీమతి ఎస్. ఖాజాబి, ఎస్. మహబూబ్ సాహెబ్ దంపతులకు కడపలో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1995 మే 28న రంగస్థలంపై అడుగుపెట్టింది.
- పద్యనాటకాలు: తారాశశాంకము, వేమన యోగి, చింతామణి, రావణ విజయం, శివకేశవ సంగ్రామం, శ్రీకృష్ణతులాభారం, మహారథికర్ణ.
- సాంఘిక నాటకాలు: కొయ్యగుర్రం, సీనియర్ సిటిజన్, నువ్వో సగం - నేనో సగం, రూపాయి – మహిత, మహాప్రస్థానం, అనుబంధం, నరావతారం, కళాఖండం, చూడు చూడు తమాషా, జగమే మాయ, జారుడుమెట్లు
బహుమతులు
[మార్చు]అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
- జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[1]
- ప్రత్యేక బహుమతి - జగమే మాయ (నాటిక), (అపర్ణ నాటక కళాపరిషత్, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)[2]
టీవీరంగం
[మార్చు]అపరంజి, ఆడపిల్ల, చక్రవాకం, గీతాంజలి, మాయాబజార్, తూర్పు పడమర, అనుబంధం, సంధ్యారాగం, యువ, అంజలి, కోయిలమ్మ వంటి ధారావాహికలలో నటించింది.
చలనచిత్రరంగం
[మార్చు]మేస్త్రీ, ఆదివిష్ణు, సుందరానికి తొందరెక్కువ, బ్రహ్మ, డాన్ సినిమాల్లో నటించింది.
మూలాలు
[మార్చు]- ↑ "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. Archived from the original on 2017-04-21. Retrieved 2021-12-14.
- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
- నవీన. ఎస్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 55.