నవీన షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీన షేక్
Naveena Shake.jpg
జననం (1979-07-05) 1979 జూలై 5 (వయస్సు: 41  సంవత్సరాలు)
కడప, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తినటి
తల్లిదండ్రులుఎస్. మహబూబ్ సాహెబ్, ఎస్. ఖాజాబి,

నవీన షేక్ (జులై 5, 1979) ప్రముఖ రంగస్థల, సినీ, టివీ నటి.

జననం[మార్చు]

ఈవిడ 1979, జులై 5 వ తేదిన శ్రీమతి ఎస్. ఖాజాబి, ఎస్. మహబూబ్ సాహెబ్ దంపతులకు కడపలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

1995 మే 28న రంగస్థలంపై అడుగుపెట్టింది.

  • పద్యనాటకాలు: తారాశశాంకము, వేమన యోగి, చింతామణి, రావణ విజయం, శివకేశవ సంగ్రామం, శ్రీకృష్ణతులాభారం, మహారథికర్ణ.
  • సాంఘిక నాటకాలు: కొయ్యగుర్రం, సీనియర్ సిటిజన్, నువ్వో సగం - నేనో సగం, రూపాయి – మహిత, మహాప్రస్థానం, అనుబంధం, నరావతారం, కళాఖండం, చూడు చూడు తమాషా, జగమే మాయ

బహుమతులు[మార్చు]

అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

  1. ప్రత్యేక బహుమతి - జగమే మాయ (నాటిక), (అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)[1]

టీవీరంగం[మార్చు]

అపరంజి, ఆడపిల్ల, చక్రవాకం, గీతాంజలి, మాయాబజార్, తూర్పు పడమర, అనుబంధం, సంధ్యారాగం, యువ, అంజలి, కోయిలమ్మ వంటి ధారావాహికలలో నటించింది.

చలనచిత్రరంగం[మార్చు]

మేస్త్రీ, ఆదివిష్ణు, సుందరానికి తొందరెక్కువ, బ్రహ్మ, డాన్ సినిమాల్లో నటించింది.

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
  • నవీన. ఎస్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 55.
"https://te.wikipedia.org/w/index.php?title=నవీన_షేక్&oldid=2967895" నుండి వెలికితీశారు