నాంపల్లి సరాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాంపల్లి సరాయి
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంనాంపల్లి, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1919

నాంపల్లి సరాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న భవనం. దీనిని సలాహ్ సరాయి (ప్రశాంత విశ్రాంతి మందిరం) అని కూడా పిలుస్తారు. ఇది 1919లో 6వ నిజాం రాజైన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నిర్మించబడింది.[1]

నిర్మాణం[మార్చు]

ఐదో నిజాం మీర్‌ తహినియత్‌ అలీఖాన్‌ కొలువులో రౌతుగా పనిచేసి, ఆరో నిజాం పాలనలో మున్సుబ్‌దార్‌ గా పదోన్నతి పొందిన టిప్పుఖాన్‌ బహదూర్‌ 1910లో నాంపల్లి సరాయి నిర్మాణాన్ని ప్రారంభించాడు. 1919లో భవనం పూర్త సరాయి సేవలు మొదలయ్యే నాటికి టిప్పుఖాన్‌ చనిపోయాడు. ఆయన స్మారకంగా ఆ భవనాన్ని టిప్పుఖాన్‌ సరాయిగా పిలిచేవారు.[2]

నాంపల్లి రైల్వే స్టేషన్, కస్టమ్స్ హౌస్ కు సమీపంలో 5,828 చదరపు గజాల (4,873 మీటర్ల) విస్తీర్ణంలో ఈ భవనం విస్తరించివుంది.[3][4] భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ కృషి ఫలితంగా నాంపల్లి సరాయికి 2011లో వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. లభించింది.[5]

ఉద్దేశ్యం[మార్చు]

గ్రామీణ, ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర పనుల మీద నగరానికి వస్తూపోతున్న వారికి మూడు రోజుల పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలను అందించడంకోసం ఈ సరాయి (అతిథి గృహం) నిర్మించబడింది. 1956 తరువాత టిప్పు సరాయి భవనాన్ని ప్రభుత్వ అతిథి గృహంగా ఉపయోగించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, నిపుణ న్యూస్ (28 September 2017). "హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు". Archived from the original on 31 డిసెంబరు 2018. Retrieved 31 December 2018.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (28 April 2018). "నాంపల్లి సరాయికి వందేళ్లు." Archived from the original on 31 డిసెంబరు 2018. Retrieved 31 December 2018.
  3. "Plea against demolishing Nampally Sarai". The Hindu. Retrieved 31 December 2018.[permanent dead link]
  4. "Nampally Sarai to regain glory". The Hindu (in Indian English). 26 January 2007. ISSN 0971-751X. Retrieved 31 December 2018.
  5. "Metro rail threat looms large over Nampally Sarai". Times of India. Archived from the original on 2012-07-30. Retrieved 31 December 2018.