Coordinates: 17°10′01″N 82°22′41″E / 17.1670°N 82.3781°E / 17.1670; 82.3781

నాగులపల్లి (కొత్తపల్లె)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగులాపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
నాగులాపల్లి is located in Andhra Pradesh
నాగులాపల్లి
నాగులాపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°10′01″N 82°22′41″E / 17.1670°N 82.3781°E / 17.1670; 82.3781
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కాకినాడ
మండలం కొత్తపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,283
 - పురుషులు 3,641
 - స్త్రీలు 3,642
 - గృహాల సంఖ్య 2,476
పిన్ కోడ్ 533 447
ఎస్.టి.డి కోడ్

నాగులాపల్లి, కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలానికి చెందిన గ్రామం.[1].

ఇది మండల కేంద్రమైన కొత్తపల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిఠాపురం నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,902.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,914, మహిళల సంఖ్య 3,988, గ్రామంలో నివాస గృహాలు 2,366 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2476 ఇళ్లతో, 7283 జనాభాతో 988 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3641, ఆడవారి సంఖ్య 3642. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 567 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 8. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587479.[3] పిన్ కోడ్: 533447.

సమీప గ్రామాలు.[మార్చు]

తూర్పున మూలపేట, పశ్చిమాన ఇసుకపల్లి, దక్షిణాని ఎండపల్లి, ఉత్తరాన రమణక్కపేట

సమీప మండలాలు[మార్చు]

పిఠాపురం, గొల్లప్రోలు, తొండంగి మండలాలు సమీపంలో ఉన్నాయి

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి పొన్నాడలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొత్తపల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలోనూ ఉన్నాయి. సమీప వైద్యకళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కాకినాడలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉన్నాయి.అబ్బిరెడ్డి సత్తిరెడ్డి జిల్లా పరిషత్ 30 ఏళ్ల క్రితం ప్రారంభించారు. వేలాది మంది ఉన్నత విద్యావంతులు కావడానికి తోడ్పడింది. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (చెరువు కాడ బడి) వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాల.ండల పరిషత్ పాఠశాల కూడా మరోటి ఉంది. సిధ్దార్థ స్కూల్ కూడా దశాద్దన్నర కాలంగా ఉంది

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నాగులపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగులపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి  గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.పిఠాపురం నుంచి కోనపాపపేట, శ్రీరాంపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు నాగులాపల్లి మీదుగా వెళతాయి. పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండ్ నుంచి ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. రైలులో వస్తే పిఠాపురం స్టేషనులో దిగి బస్సు గానీ, ఆటో ద్వారా గానీ నాగులాపల్లి రావాల్సి ఉంటుంది.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన శాఖ ఇక్కడ ఉంది

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నాగులపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 151 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 837 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 5 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 832 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

నాగులపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 832 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నాగులపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

గ్రామ విశేషాలు[మార్చు]

ఇచ్ఛట ఎక్కడ చూసినా పచ్ఛని పంట పొలాలతొ ఛూడడానికి మనసు ఎంతో ఆహ్లాదంగా వుంటుంధి. అంతే కాదు ఈ ఊరిలో సుమారు 250 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. పురాతన ఆలయాలు ఉన్నాయిక్కడ. చాలా మంది సివిల్స్ ఆఫీసర్స్ ఉన్నారు. మాజీ శాసన సభ్యులు బుల్లబ్బాయి రెడ్డి ఈ ఊరికి చెందిన వ్యక్తి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

నాగులాపల్లి పాడిపంటలతో అలరారే పచ్చని గ్రామం. గ్రామంలో పంచాయితీ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంధ్రం, వెటర్నరీ హాస్సిటల్, ఒక జెడ్పీ ఉన్నత పాఠశాల, రెండు ఎలిమెంటరీ స్కూళ్లు, పలు ఆలయాలు, రచ్చబండలు ఉన్నాయి.

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

మొదటి నుంచి భూస్వామ్యల పెత్తనం కొనసాగిన గ్రామం.అయితే వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు కూడా సాగాయి. కమ్యూనిస్ట్ లు, ఆతర్వాత డీవైఎఫ్ఐ వాళ్లు ఉద్యమాలు చేశారిక్కడ. ప్రస్తుతం వైఎస్సార్సీపీకి కొంత ఆధిపత్యం ఉన్నా, టీడీపీ కూడా బలంగానే ఉంటుంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

దేవుడి గుడిగా పిలుచుకునే రామాలయం అత్యంత ప్రధానమైనది. చారిత్రక సంపద. శివాలయంతో పాటు మూడు రామాలయాలు, మూడు చర్చిలు, వినాయకుడి గుడి, దుర్గమ్మ ఆలయాలు రెండు, అయ్యప్ప, సాయినాధుని ఆలయాలున్నాయిక్కడ.ఊరి నడిబొడ్డున ఉండే చెరువు ఒకప్పుడు మంచనీటికి ఆధారం. కానీ ఇప్పుడా కొలను చూడముచ్చటగా ఉంటుంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, కొద్దిమంది వృత్తిదారులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

నాగులాపల్లి విద్యాకుసుమాల కల్పవల్లి. ఉపాధ్యాయుల లోగిలి. పలువురు ప్రముఖులు ఈ గ్రామంలో ఉన్నారు. ఆనందరావు మాస్టారు, వెంకటపతి మాస్టారు,అప్పారావు మాస్టారు వంటి అనేక మంది సీనియర్ ఉపాధ్యాయులు నుంచి ఇటీవలే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వందల మంది వరకూ సుమారు 240 మంది వరకూ ఉపాధ్యాయ ప్రముఖలు ఉన్నారు. భాస్కర్ రెడ్డి ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగిగా ఉన్నారు. చింతపల్లి సుబ్బిరెడ్డి ఉపాధి కల్పనాశాఖలో జిల్లా స్థాయి అధికారిగా ఉన్నారు.కన్నూరి జోగిరెడ్డి జిల్లా విద్యాశాఖాదికారి కార్యాలయంలో పని చేయు చ్గున్నారు. వారి కుమార్తె, అల్లుడు డాక్టర్లగా ఉన్నారు. రమణారెడ్డి మండల అభివృద్ధి అధికారిగా పని చెయుచున్నారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-03.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".