నాదెళ్ల పురుషోత్తమ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాదెళ్ళ పురుషోత్తమ కవి (ఏప్రిల్ 23, 1863 - నవంబర్ 27, 1938) హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు, ఆదర్శోపాధ్యాయుడు, శతాధిక గ్రంథకర్త, బుధ విధేయని పత్రికా సంపాదకులు, జ్యోతిషమంత్ర శాస్రవేత్త, తెలుగు నాటకాలలో పాత్రోచిత భాషా ప్రయోగానికి ఆద్యుడు.

జననం[మార్చు]

ఈయన పూర్వీకులది కృష్ణా జిల్లా నాదెళ్ల గ్రామం. ఈయన దివితాలూకా సీతారామపురం అగ్రహారంలో 1863, ఏప్రిల్ 23న జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బాంబిక, కామేశ్వరశాస్త్రి. 1864లో ఉప్పెనకు గ్రామం కొట్టకుపోగా ఈయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఇక్కడ హిందీ, పారశీక భాషలు నేర్చుకున్నాడు. తొమ్మిదవ ఏటనే పితృవియోగం కలిగినందువల్ల నాదెళ్ల హైదరాబాదు నుంచి తిరిగి వచ్చి సీతారామపురంలో స్థిరపడ్డారు. తరువాత బందరు హిందూ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం కొంతకాలం ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. బందరు నేషనల్ థియేట్రికల్ సొసైటీ కోరిక మేరకు హిందుస్తానీలో నాటకాలు రాసి ఇచ్చారు.

బందరులో 1886లో బుధజన విధేయని పత్రిక స్థాపించారు. 1887లో బందరు హిందూ ఉన్నత పాఠశాల బ్రాంచి ప్రధానోపాధ్యాయులుగా చేరారు. ఆ తరువాత 1890లో హైందవ పాఠశాలను, హిందూమత బాలసమాజం స్థాపించి, హిందూ మతోద్ధరణకు పాటుపడ్డారు.

సిద్ధేంద్రయోగి భామాకలాసం, వీధి నాటకాల ప్రభావంతో 16వ ఏటనే 1879లో అహల్యాసంక్రందనం అనే యక్షగానం రాశారు. ఈ యక్షగానాన్ని వీధినాటకాల వాళ్లు ఎక్కువగా ప్రదర్శించారు. 1888లో నాదెళ్ల రచించిన హరిశ్చంద్ర నాటకంలో పాత్రోచిత భాషాప్రయోగం చేసి, పాత్రోచిత భాషా ప్రయోగానికి దారి చూపారు. ఈ నాటకం 1888లో బుధజన విధేయని పత్రికలో ప్రకటించి, తరువాత 1890లో గ్రంథరూపంలో ప్రచురించారు.

తెలుగులో అహల్యాసంక్రందనం (1883), హరిశ్చంద్ర (1917), పారిజాతాపహరణం, సారంగధర, ద్రౌపదీ వస్త్రాపహరణం, చంద్రహాస (1916), స్త్రీల మీటింగు నాటి హరికథ ప్రహసనం (1908), హిందీ- కాళాసురవధ, పంచాక్షరీ మహిమ, సుభద్రా పరిణయం, శంబూక వధ, శారదోపాఖ్యానం, లవణాసుర సంహారం (1916), చిత్ర కందపద్య రత్నాకరము (1922) [1]వంటి ప్రసిద్ధ రచనలు చేశారు.

మరణం[మార్చు]

నాదెళ్ల 1938, నవంబర్ 27 న మరణించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

  1. పురుషోత్తమకవి, నాదెళ్ళ. చిత్ర కందపద్య రత్నాకరము.