Jump to content

నాబెందు ఘోష్

వికీపీడియా నుండి
నాబెందు ఘోష్
జననం( 1917 -03-27)1917 మార్చి 27
మరణం2007 డిసెంబరు 15(2007-12-15) (వయసు 90)
ఇతర పేర్లుముకుల్; నాబెందు భూషణ్ ఘోష్
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు

నబెందు ఘోష్ (1917, మార్చి 27 - 2007, డిసెంబరు 15) బెంగాలీ సాహిత్యకారుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. సుజాత, బాందిని, దేవదాస్, మజ్లి దీదీ, అభిమాన్, తీస్రీ కసమ్ వంటి క్లాసిక్ బాలీవుడ్ సినిమాలకు స్క్రీన్ ప్లేలు రాశాడు. బాప్ బేటీ, శత్రంజ్, రాజా జాని వంటి సినిమాలకు కథలు రాశాడు. దో బిఘా జమీన్, తీస్రీ కసమ్, లుకోచూరి సినిమాలలో నటించాడు. ఆ తర్వాత నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

నాబెందు ఘోష్ 1917 మార్చి 27న బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో జన్మించాడు.

కుటుంబం

[మార్చు]

ఇతని భార్య కనక్లత 1999లో మరణించింది.[1] అతనికి ఇద్దరు కుమారులు (డాక్టర్ దీపాంకర్, సినీనిర్మాత శుభంకర్), ఒక కుమార్తె (రత్నోత్తమ సేన్‌గుప్తా: ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్, రచయిత్రి, మాజీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ జర్నలిస్ట్) ఉన్నారు. ఇతని ఆత్మకథ, ఏక నౌకర్ జాత్రి 2008 మార్చిలో ప్రచురించబడింది.[2] ఇతని కోడలు డాక్టర్ సోమ ఘోష్ ప్రశంసలు పొందిన శాస్త్రీయ గాయకురాలు, 2016లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడింది.[3]

కళారంగం

[మార్చు]

12 సంవత్సరాల వయస్సులో నాటకరంగంలో ప్రముఖ నటుడిగా ఎదిగాడు. ఉదయ్ శంకర్ శైలిలో ప్రశంసలు పొందిన నృత్యకారుడిగా, 1939-1945 మధ్య అనేక పతకాలను గెలుచుకున్నాడు. 1944లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా దక్ దియే జై రాసినందుకు ఘోష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నవల అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. 1945లో కలకత్తాకు వెళ్ళాడు. బెంగాలీ సాహిత్యంలో అత్యంత ప్రగతిశీల యువ రచయితలలో స్థానం సంపాదించాడు.

విభజన తరువాత, ఉర్దూ తూర్పు పాకిస్తాన్ రాష్ట్ర భాషగా ప్రకటించబడింది; తద్వారా అన్ని బెంగాలీ సాహిత్యం, సినిమాలను నిషేధించారు. ఈ రాజకీయ విభజనే నాబెందు ఘోష్‌ను 1951లో కోల్‌కతాలోని నాటకరంగాన్ని విడిచిపెట్టి బాంబే టాకీస్ కోసం సినిమాలు చేయడానికి బిమల్ రాయ్‌లో చేరడానికి ప్రేరేపించింది. హృషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్, పాల్ మహేంద్ర, కమల్ బోస్, సలీల్ చౌదరి తదితరులతో పనిచేశాడు. బిమల్ రాయ్ మరణం తరువాత, ఘోష్ హృషికేశ్ ముఖర్జీతో కలిసి విస్తృతంగా పనిచేశాడు.[4]

నాబెందు ఘోష్ 1940ల నాటి అన్ని చారిత్రక తిరుగుబాట్లు - కరువు, అల్లర్లు, విభజన, ప్రేమపై రచనలు చేశాడు. దాదాపు 26 నవలలు, 14 చిన్న కథల సంకలనాలు ప్రచురించాడు. శారదిందు బందోపాధ్యాయ రాసిన మరు ఓ సంఘా అనే చిన్న కథ ఆధారంగా 1988లో తీసిన త్రిషాగ్ని సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమాలు

[మార్చు]
స్క్రీన్ ప్లే రచయితగా
  • పరిణీత (1953)
  • బిరాజ్ బహు (1954)
  • బాద్బాన్ (1954)
  • ఆర్ పార్ (1954)
  • దేవదాస్ (1955)
  • యహుది (1958)
  • ఇన్సాన్ జాగ్ ఉతా (1959)
  • సుజాత (1959)
  • బాందిని (1963)
  • తీస్రీ కసమ్ (1966)
  • మజ్లీ దీదీ (1967)
  • షరాఫత్ (1970)
  • లాల్ పత్తర్ (1971)
  • అభిమాన్ (1973)
  • జీల్ కే ఉస్ పార్ (1973)
  • దో అంజానే (1976)
  • గంగా కీ సౌగంధ్ (1978)
  • క్రోధి (1981)
దర్శకుడిగా
  • పరిణీత (1953) (సహాయ దర్శకుడు)
  • త్రిషాగ్ని (1988)
  • నేత్రహీన్ సాక్షి (1992)
  • లడ్కియాన్ (1997)
  • అన్మోల్ రతన్: అశోక్ కుమార్ (డాక్యుమెంటరీ/1995)

అవార్డులు

[మార్చు]

సాహిత్య పురస్కారాలు

[మార్చు]
  • బంగ్లా అకాడమీ నుండి బంకిం పురస్కారం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
  • బంగియా సాహిత్య పరిషత్ నుండి హరప్రసాద్ ఘోష్ మెడల్
  • బిభూతి భూషణ సాహిత్య అర్ఘ్య
  • బిమల్ మిత్ర పురస్కారం
  • అమృత పురస్కారం

సినిమా అవార్డులు

[మార్చు]

మరణం

[మార్చు]

నాబెందు ఘోష్ 2007, డిసెంబరు 15న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Obituary – Nabendu Ghosh". Sify Movies. 22 January 2008. Archived from the original on 8 April 2014. Retrieved 2023-07-26.
  2. "Frames from the past: For the love of words". The Telegraph. 23 March 2008. Archived from the original on 30 June 2013. Retrieved 2023-07-26.
  3. "BISMILLAH KHAN SAAB IS 100 AND LIVES THROUGH HIS SHEHNAI!". Spicy Stars Mumbai. 2016-10-20. Archived from the original on 30 November 2016. Retrieved 2023-07-26.
  4. "Memories and melodies of a golden era". The Hindu. 13 April 2001. Archived from the original on 29 October 2013. Retrieved 2023-07-26.
  5. "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2023-07-26.
  6. "Best Screenplay Award". Filmfare Award Official Listings, Indiatimes. Archived from the original on 2014-04-29. Retrieved 2023-07-26.
  7. Awards – Majhli Didi Internet Movie Database.

బాహ్య లింకులు

[మార్చు]