Jump to content

తీస్రీ కసమ్

వికీపీడియా నుండి
తీస్రీ కసమ్
తీస్రీ కసమ్ సినిమా పోస్టర్
దర్శకత్వంబసు భట్టాచార్య
స్క్రీన్ ప్లేనాబెందు ఘోష్
ఫనిశ్వర్నాథ్ రేణు (మాటలు)
దీనిపై ఆధారితంఫనిశ్వర్నాథ్ రేణు రాసిన మరే గయే గుల్ఫామ్ అనే కథ
నిర్మాతశైలేంద్ర
తారాగణంరాజ్ కపూర్
వహీదా రెహమాన్
ఛాయాగ్రహణంసుబ్రతా మిత్రా
కూర్పుజి.జి. మాయేకర్
సంగీతంశంకర్ జైకిషన్
శైలేంద్ర
హస్రత్ జైపురి (పాటలు)
నిర్మాణ
సంస్థ
ఇమేజ్ మేకర్స్
విడుదల తేదీ
1966
సినిమా నిడివి
159 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

తీస్రీ కసమ్, 1966లో విడుదలైన హిందీ సినిమా. గేయ రచయిత శైలేంద్ర నిర్మించిన ఈ సినిమాకు బసు భట్టాచార్య దర్శకత్వం వహించాడు. హిందీ నవలా రచయిత ఫనిశ్వర్నాథ్ రేణు రాసిన మరే గయే గుల్ఫామ్ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాలో రాజ్ కపూర్, వహీదా రెహమాన్ జంటగా నటించారు.[1] శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చగా, సుబ్రతా మిత్రా సినిమాటోగ్రఫీ, ఫనిశ్వర్నాథ్ రేణు సంభాషణలు, నబేండు ఘోష్ స్క్రీన్ ప్లే అందించారు.[2]

భారతీయ గ్రామీణ నేపథ్యంలోని సమాజాన్ని చూపించిన సినిమా ఇది. ఎద్దుల బండి నడిపే అమాయక హిరామన్, నౌతంకి కి చెందిన నర్తకి హిరాబాయితో ప్రేమలో పడిన కథ ఇది. జానపద కళల ప్రదర్శనల సందర్భంగా మహిళలను దోపిడీ చేసే సంఘటనల గురించి ఈ సినిమా వివరిస్తుంది.[3] బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయవంతం కానప్పటికి, 14వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.

నటవర్గం

[మార్చు]
  • రాజ్ కపూర్ (హిరామన్)
  • వహీదా రెహమాన్ (హిరాబాయి)
  • దులారి (హిరామన్ వదిన)
  • ఇఫ్తేఖర్ (ఠాకూర్ విక్రమ్ సింగ్)
  • కేష్టో ముఖర్జీ (శివరాతన్)
  • ఎకె హంగల్ (హిరామన్ అన్నయ్య)
  • అసిత్ సేన్ (మేళా అనౌన్సర్)
  • సిఎస్ దుబే (బిర్జు)
  • శైలేంద్ర

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా పూర్తవడానికి చాలా ఏళ్ళు పట్టింది. అరారియా జిల్లాలోని ఔరాహి హింగ్నా, భోపాల్ సమీపంలోని బినా అనే పట్టణంలో ఈ సినిమాలోని చాలాభాగం చిత్రీకరణ జరిగింది.[4][5] పోవై సరస్సు సమీపంలో, ముంబైలోని మోహన్ స్టూడియోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి.[6][7] సత్యజిత్ రే తొలి సినిమాలకు ఛాయాగ్రాహకుడు సుబ్రతా మిత్రా మర్చంట్ ఐవరీ సినిమాలు చేయడానికి కొంతకాలం ముంబైకి వెళ్ళాడు.[8][9] నాటకరంగ నటుడు ఎకె హంగల్, ఇప్టా నాటకసంస్థలో సన్నిహితుడైన శైలేందర్ కోరిక మేరకు హిరామన్ అన్నయ్య పాత్రను పోషించడానికి అంగీకరించాడు. సినిమా పొడవును తగ్గించడానికి చివరి ఎడిటింగ్‌లో అతని పాత్ర చాలా వరకు తగ్గించబడింది.[7]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: బసు భట్టాచార్య
  • కథ, మాటలు: ఫనిశ్వర్ నాథ్ రేణు
  • స్క్రీన్ ప్లే: నాబెందు ఘోష్
  • నిర్మాత: శైలేంద్ర
  • ఎడిటర్: జి.జి.మాయేకర్
  • సినిమాటోగ్రాఫర్: సుబ్రతా మిత్రా
  • కళా దర్శకుడు: దేశ్ ముఖర్జీ
  • కాస్టూమ్స్: పండిట్ శివ్రామ్
  • కొరియోగ్రాఫర్: లచు మహారాజ్
  • సంగీతం: శంకర్-జైకిషన్
  • పాటలు: హస్రత్ జైపురి
  • గానం: ఆశా భోస్లే, మన్నా డే, సుమన్ కళ్యాణ్పూర్, లతా మంగేష్కర్, ముబారక్ బేగం, ముఖేష్, శంభు-శంకర్ (కవ్వాల్)

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం గ్రహీత ఫలితం
1967 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ చలన చిత్రం శైలేంద్ర, బసు భట్టాచార్య గెలుపు
ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ గీత రచయిత శైలేంద్ర ప్రతిపాదించబడింది
మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గ్రాండ్ ప్రిక్స్ బసు భట్టాచార్య ప్రతిపాదించబడింది
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు (హిందీ) ఉత్తమ దర్శకుడు గెలుపు
ఉత్తమ నటుడు రాజ్ కపూర్ గెలుపు
ఉత్తమ నటి వహీదా రెహమాన్ గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Teesri Kasam (1966)". Indiancine.ma. Retrieved 2021-06-17.
  2. Chatterjee 2003, p. 335.
  3. Singh 2007, p. 60.
  4. "यहां हुई थी फिल्म 'तीसरी कसम' की शूटिंग, रिलीज को हुए 50 साल पूरे". Manohar Kumar. Purnia: Dainik Bhaskar. 25 September 2016. Archived from the original on 2016-12-10. Retrieved 2021-06-17.
  5. "Maila Anchal inspirer dead". The Telegraph - Calcutta (Kolkata). January 15, 2011. Archived from the original on 2017-08-14. Retrieved 2021-06-17.
  6. Rehman 2014, p. 95.
  7. 7.0 7.1 Hangal 1999, p. 95.
  8. Srivastava 1988, p. 178.
  9. Sinha 2005, p. 131-132.

గ్రంథ పట్టిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]