Jump to content

నార్నూర్ బాలాజీ మందిరం

వికీపీడియా నుండి

నార్నూర్ బాలాజీ మందిరం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రం విజయనగర్ కాలని సమీపంలోని కొండ పైన ఉంది. బాలాజీ మందిరాన్ని మిని వెంకటేశ్వర్ స్వామి దేవాలయం అని కూడా అంటారు[1].


నార్నూర్ బాలాజీ మందిరం
బాలాజీ మందిరం నార్నూర్,
బాలాజీ మందిరం నార్నూర్,
పేరు
ఇతర పేర్లు:మిని వెంకటేశ్వర ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా
ప్రదేశం: విజయనగర్ కాలని నార్నూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వెంకటేశ్వర స్వామి
ప్రధాన దేవత:సీతరామ,విఠలరుక్మిణి,రాధాకృష్ణా,
ఉత్సవ దైవం:వెంకటేశ్వరుడు
ముఖ్య_ఉత్సవాలు:వేసవిలో 41రోజులు దీక్షలు,బ్రహ్మోత్సవాలు, సత్సంగ్ కార్యక్రమాలు
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:04
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1992

ఆలయ చరిత్ర

[మార్చు]

బాలాజీ మందిరానికి వందేళ్ళ చరిత్ర ఉంది.పుర్వకాలంలో ఆ కొండ పై ఒక దేవ వృక్షం ఉండేదని దాని సమీపంలో బాలాజీ విగ్రహాం ఉండేదని ఆ దేవవృక్షం క్రింద ఒక గుర్తు తెలియని ఋషి వచ్చి పులి తోలు పై కూర్చొని అమావాస్య పౌర్ణమి రోజున దేవుని పూజలు చేసి తపస్సు చేస్తూ ఉండే వాడు అని అంటారు.అక్కడ అమావాస్య,పౌర్ణమి న ఒక నాగుపాము సంచరించేది అని దీని ప్రక్కన ఉన్న కొండ పై నుండి బాలాజీ కొండ పై ఒక దీపం వెలుగు వలే ఒక దివ్యజ్యోతి కనిపించేది అని గ్రామ పెద్ద వారు చెబుతుంటారు.కొన్న సంవత్సరాల తర్వాత ఆ కొండ పై ఉన్న బాలాజీ విగ్రహాన్ని నార్నూరు గ్రామస్థులు పూజలు చేయడం ప్రారంభించారు. అరవై సంవత్సరం క్రితం నార్నూర్ గ్రామానికి చెందిన ధర్మకర్త దివంగత బానోత్ జాలంసింగ్ మందిరం కోసం భూమి పూజ చేసి తొలి సారిగా ఒక చిన్న గుడి కట్టించారు.‌

ఆలయ పునర్నిర్మాణం

[మార్చు]

బాలాజీ కొండ పై ఉన్న పురాతన గుడిని ఒక భవ్యమైన మందిరం నిర్మాణం చేయాలనే ఒక నూతన ఆలోచనతో గ్రామస్తులు సహాయంతో కొండపై మందిర నిర్మాణం గురించి ధర్మకర్తల ముందు ప్ర‌స్తావించారు.అందరి సమ్మతితో ఆలయాభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఉత్తరం ద్వారా కోరడంతో స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధికారి ఆ ఆలయానికి రూ. ఐదు లక్షలు నిధులు మంజూరు చేశారు. అనంతరం పనులు ప్రారంభించి అరువై లక్షల ప్రతిపాదనలను తితిదే అధికారులకు మళ్ళి సమర్పించారు. రాష్ట్ర‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆలయ నిర్మాణానికి రూ.యాభ్భై లక్షల నిధులు మంజూరు చేశారు. గ్రామస్థులు స్థానిక వ్యాపారస్థులు అందరు కలసి ఆలయ నిర్మాణానికి నడుం బిగించడం తో అరువై లక్షలు పొగు చేసి కల్యాణ మండపం ఆలయ గర్భగుడిని ధ్వజస్తంభాన్ని నిర్మించారు.ఆలయ ఆవరణంలో అతి పెద్ద అంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నిర్మించారు.

ప్రతిష్ఠాపన మహోత్సవము

[మార్చు]

నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి తేది:10 మే 2023 బుధవారము నుండి వైశాఖ బహుళ పంచమి శుక్రవారము తేది:12 మే 2023 వరకు ప్రతిష్ఠాపన మహోత్సవ పీఠాధిపతులు తేదిని ఖరారు చేశారు.నార్నూర్ బాలాజీ[2] ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠపన ముహూర్తం తేది:12మే 2023 వైశాఖ బహుళ సప్తమి శుక్రవారము ఉ|| 9:24 ని, లకు శ్రావణ నక్షత్ర యుక్త మిథున లగ్నం న శ్రీ వెంకటేశ్వర సహిత పట్టాభిషేక సీత రామచంద్ర సహిత శివపంచాయుతన విఠలేశ్వర రాధశ్యాం నవగ్రహ ధ్వజస్తంభ త్రయాహ్నిక ప్రతిష్ఠా మహోత్సవము ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్ర పండితులు యాజ్ఞికులు శ్రీ మాన్ శ్రీ మధు శంకర్ శర్మ ధర్మపురి వారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ మహోత్సవంలో గ్రామప్రజలు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వివిధ దేవస్థానాల పీఠాధిపతులు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఆలయ ప్రత్యేకత

[మార్చు]

ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి సంవత్సరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానము ధార్మిక ప్రచార మండలి ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ నిర్వహించడం జరుగును.

తెలంగాణ మహారాష్ట్ర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాధు సంతులతో సంత్ మహాత్ముల సత్సంగ్ సప్తా కార్యాక్రమాలు జరుగును.

శ్రావణమాసంలో నెల రోజులు పాటు శ్రీహరి కథ పారాయణం కోమ్మవార్ గజానంద్, పవార్ లోక్ చంద్ అధ్వర్యంలో జరుగును.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ అరవింద శాస్త్రి బృందావనం వారిచే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ మద్భగవత్ గీత పారాయణంతో పాటువైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో ఆలయ పూజారి సాయికృష్ణా శాస్త్రి చే ధూప దీప ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి.

స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక భక్తి భావంతో భక్తులచే ధనుర్మాసంలో ఇరువై ఒకటి రోజులు, నలభై ఒకటి రోజులు దీక్షలు అనుసరించి స్వాముల వారికి మొక్కులు తీర్చుకుంటారు.

ఈ ఆలయంలోని చాలా మంది పేద ప్రజల శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు ఉపయోగపటం విశేషం.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఉండును.ఆలయ నిర్వణ కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగును.

మూలాలు

[మార్చు]
  1. Sanagala, Naveen (2007-09-24). "Sri Venkateshwara Swamy Temple, Narnoor". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  2. "Narnoor Town , Narnoor Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2024-03-10.