Jump to content

నాసిర్ జంషెడ్

వికీపీడియా నుండి
నాసిర్ జంషెడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నాసిర్ జంషెడ్
పుట్టిన తేదీ (1989-12-06) 1989 డిసెంబరు 6 (వయసు 35)
లాహోర్, పాకిస్తాన్
ఎత్తు1.78 మీ. (5 అ. 10 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 210)2013 ఫిబ్రవరి 1 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 160)2008 జనవరి 21 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2015 మార్చి 4 - United Arab Emirates తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.77
తొలి T20I (క్యాప్ 48)2012 సెప్టెంబరు 5 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 నవంబరు 22 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005–2017పాకీ నేషనల్ బ్యాంక్
2012Chittagong Kings
2005–2014లాహోర్ లయన్స్
2012Ruhuna Royals
2015Dhaka Dynamites
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20
మ్యాచ్‌లు 2 45 18
చేసిన పరుగులు 51 1,443 363
బ్యాటింగు సగటు 12.75 34.57 21.35
100s/50s 0/0 3/8 0/2
అత్యధిక స్కోరు 46 112 56
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 12/– 6/–
మూలం: ESPNcricinfo, 2013 డిసెంబరు 3

నాసిర్ జంషెడ్ (జననం 1989, డిసెంబరు 6) పాకిస్తానీ మాజీ క్రికెటర్. గతంలో వన్ డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు.[1]

2017 ఫిబ్రవరిలో, 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా సస్పెండ్ చేయబడ్డాడు. తరువాత ఒక సంవత్సరం నిషేధించబడ్డాడు. 2018 ఆగస్టులో, స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ అతనిని మరో పదేళ్ళపాటు నిషేధించింది. 2020 ఫిబ్రవరిలో, నేరాన్ని అంగీకరించిన తర్వాత అతను పదిహేడు నెలలపాటు జైలులో ఉన్నాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఫస్ట్ క్లాస్ కెరీర్

[మార్చు]

నాసిర్ కేవలం 15 సంవత్సరాల వయస్సులో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. త్వరలో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు, అరంగేట్రంలో రెండవ ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేశాడు.[2] ట్వంటీ20 స్థాయిలో, 15 సంవత్సరాల 140 రోజుల వయస్సులో 2005 ఏప్రిల్ లో లాహోర్ లయన్స్ తరపున అరంగేట్రం చేసాడు. తద్వారా ట్వంటీ 20 మ్యాచ్‌లలో ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.[3]

2005-06 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ సిరీస్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. జింబాబ్వేతో ఆడేందుకు పాట్రన్స్ XI జట్టులో ఎంపికయ్యాడు. 182 పరుగులు చేసాడు, ఒక వారంలో పాకిస్తాన్ తరపున వన్డే క్రికెట్ ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

జింబాబ్వేతో జరిగిన అరంగేట్రంలో, బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 48 బంతుల్లో 61 పరుగులు చేశాడు, ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించింది. రెండవ వన్డేలో, 64 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మొదటి, రెండవ మ్యాచ్‌లలో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన మూడవ పాకిస్థానీ అయ్యాడు.

2008 ఆసియా కప్‌లో, జంషెడ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో రిటైర్డ్ హర్ట్ అయ్యేముందు భారత్‌పై 53 పరుగులు, బంగ్లాదేశ్‌పై 52 నాటౌట్‌తో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.[4][5]

2012 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌లో షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం మీర్పూర్‌లో 2012, మార్చి 18న భారతదేశంపై తన మొదటి వన్డే అంతర్జాతీయ సెంచరీని చేశాడు. కేవలం 104 బంతుల్లో 112 పరుగులు చేశాడు. మహ్మద్ హఫీజ్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. 1996లో అమీర్ సొహైల్, సయీద్ అన్వర్‌ల 144 పరుగుల రికార్డును వారు అధిగమించారు.

టీ20 కెరీర్

[మార్చు]

2009లో అనుభవజ్ఞుడైన అబ్దుల్ రజాక్‌తో కలిసి టీ20 (162) అత్యధిక 3వ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.[6][7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జంషెడ్ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న బ్రిటిష్ పౌరురాలు సమర అఫ్జల్‌ను వివాహం చేసుకున్నాడు.[9] వారికి ఒక కూతురు ఉంది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Player profile: Nasir Jamshed". CricketArchive. Retrieved 31 December 2012.
  2. "Player profile: Nasir Jamshed". ESPNcricinfo. Retrieved 31 December 2012.
  3. Records / Twenty20 matches / Individual records (captains, players, umpires) / Youngest players – ESPNcricinfo. Retrieved 21 June 2013.
  4. "Asia Cup, 10th Match, Super Four: Pakistan v India at Karachi". ESNcricinfo. Retrieved 31 December 2012.
  5. "Asia Cup, 12th Match, Super Four: Pakistan v Bangladesh at Karachi". ESNcricinfo. Retrieved 31 December 2012.
  6. "Records | Twenty20 matches | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
  7. "Group A: Lahore Lions v Quetta Bears at Lahore, May 26, 2009 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-04.
  8. "Razzaq century powers Lahore Lions to big win". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-04.
  9. 9.0 9.1 "Eight days off from release, Nasir Jamshed faces prospect of deportation to Pakistan". ESPNcricinfo.

బాహ్య లింకులు

[మార్చు]