నా పాట పంచామృతం
నా పాట పంచామృతం 1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన అల్లరి మొగుడు సినిమా లోని పాట. ఈ పాటలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, నగేష్, సత్యనారాయణ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా,[1] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేసాడు. ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.
నేపధ్యం
[మార్చు]గోపాల్ (మోహన్ బాబు) పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా కళాకారుడు సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు. ఒక సందర్భంలో రమ్యకృష్ణ తండ్రి సత్యనారాయణ సమక్షంలో సంగీత పోటీ జరుగుతుంది. ఆ పోటీ నగేష్, మోహన్ బాబుల మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో పాడిన పాట ఇది.
పద్మం బురదలో వికసిస్తుంది. గళం అశ్లీల మాటలను ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని సీతారామశాస్త్రి కోరుకున్నాడు. సరస్వతీదేవి కూర్చొనే ఆసనం పద్మం. అతని ప్రతి పాట సరస్వతీదేవి పీఠం కావాలనే కోరికతో శ్రద్ధతోనే చేశాడు. [2]
పాటలో కొంత భాగం
[మార్చు]నా పాట పంచామృతం నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
వల్లకి మీట శృతి లయలు గ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి చరణములందించనా
గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా
మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ
మూలాలు
[మార్చు]- ↑ "పద్మమై విరిసిన సాహితి వెన్నెల.. - Prabha News". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.
- ↑ "ప్రేక్షక హృదయ నిశ్శబ్దానికి ప్రతిధ్వనిని". Sakshi. 2019-02-01. Retrieved 2021-04-06.