నిజాం వజ్రం
బరువు | 340 క్యారట్లు (68 గ్రా.) |
---|---|
కోత | బాదం ఆకారం |
వెలికితీసిన దేశం | భారతదేశం |
వెలికితీసిన గని | కొల్లూరు గనులు, గోల్కొండ |
తొలి యజమాని | నిజాం |
నిజాం వజ్రం, హైదరాబాద్ రాష్ట్ర నవాబు నిజాం రాజులకు చెందిన వజ్రం. 1800లకు చెందిన ఈ వజ్రానికి హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టబడింది. దాదాపు 340 క్యారట్లు (68 గ్రా.) పరిమాణంలో ఉన్న ఈ వజ్రం కొల్లూరు గనులలో దొరికినట్లు భావిస్తున్నారు.[1] అయితే కొన్ని దశాబ్దాల నుండి ఈ వజ్రం మిస్టరీగా మిగిలిపోయింది.
చరిత్ర
[మార్చు]గోల్కొండ నవాబులకు ఆ కాలంలో 23 వజ్రాల గనులు ఉండేవి. గోల్కొండలో లభించిన వజ్రాలను కొనడానికి అప్పట్లో బ్రిటీష్, డచ్ వర్తకులు ఆశపడేవారు. ఈ వజ్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నైట్రోజన్ ఉనికి లేని ఈ వజ్రం, పసుపు రంగులో ఉంటుంది.[2] 'చిన్న కోహినూర్' అని పిలువబడే నిజాం వజ్రం కృష్ణా-గుంటూరు జిల్లాలలోని కృష్ణానది లోయ నుండి తవ్వబడింది. ప్రస్తుతం కొల్లూరు వజ్రాల గని పులిచింతల ఆనకట్ట నీటిలో మునిగిపోయింది. 1830 సంవత్సరంలో తవ్వబడిన నిజాం వజ్రం, 1948లో జరిగిన పోలీసు చర్య తర్వాత కనపడకుండాపోయింది.[3]
ఇతర వివరాలు
[మార్చు]దక్కన్ సాంప్రదాయాన్ని ప్రతిబింబిందే ఈ వజ్రం చాలా ఏళ్ళ క్రితమై విదేశాలకు తరలించబడింది. కాని, ఈ వజ్రానికి సంబంధించి అంతర్జాతీయ వేలం జరిగినట్లు ఎక్కడా పేర్కొనబడలేదు. రాష్ట్ర ఆర్కైవల్ డేటా ప్రకారం, నిజాం వజ్రం 1944లో లండన్‌లోని భారత కార్యాలయంలో ఉంది. దాని వివరాలను తెలపాలని నిజాంను కోరారు. తన వద్ద ఉన్న నిజాం, గోల్కొండ వజ్రాలు, ఇతర విలువైన రాళ్ళు, రత్నాల గురించి వివరాలు వెల్లడించడానికి నిజాం నిరాకరించాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Deccan Heritage, H. K. Gupta, A. Parasher and D. Balasubramanian, Indian National Science Academy, 2000, p. 144, Orient Blackswan, ISBN 81-7371-285-9
- ↑ Telugu, TV9 (2021-02-16). "వేలానికి సిద్ధమైన అరుదైన గోల్కొండ వజ్రం.. భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్న నిజాం వారసులు". TV9 Telugu. Retrieved 2021-09-15.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Jun 20, Syed Akbar / TNN /; 2019; Ist, 07:10. "Nizam's 11-kg gold coin, diamond still untraced | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-15.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
బయటి లింకులు
[మార్చు]- Nizam Diamond at the Wayback Machine (archived 12 డిసెంబరు 2004)
- కెప్టెన్ రిచర్డ్ బర్టన్