Jump to content

నిజామాబాదు విమానాశ్రయం

వికీపీడియా నుండి
నిజామాబాదు విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలునిజామాబాదు, తెలంగాణ
ప్రదేశంజక్రాన్‌పల్లి, నిజామాబాదు జిల్లా, తెలంగాణ

నిజామాబాదు విమానాశ్రయం, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో ప్రతిపాదించబడిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. 44వ జాతీయ రహదారిలో 30 కి.మీ. (19 మై.) నిజామాబాద్ నగరానికి తూర్పుగా 30 కి.మీ.ల (19 మైళ్ళ) దూరంలో ఈ ప్రాజెక్ట్ సైట్ ఉంది. 1,161 ఎకరాలు (4.70 కి.మీ2)లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది.

చరిత్ర

[మార్చు]

2008లో కర్నూలులో విమానాశ్రయంతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, ప్రతి విమానాశ్రయానికి ₹ 50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 500–600 ఎకరం (2.0–2.4 కి.మీ2) విస్తీర్ణంలో 6,000 అడుగులు (1,800 మీ.) రన్‌వే పొడవుతో విమానాశ్రయం ఉండాలని పేర్కొంది.[1]

విమానాశ్రయ నిర్మాణానికి ఏ కంపెనీలు బిడ్లను అందించనందున ప్రభుత్వం ఈ ప్రణాళికలను 2009 జూలైలో రద్దు చేసింది. 2009 అక్టోబరు నెలలో నిజామాబాద్ విమానాశ్రయంతో సహా 4 విమానాశ్రయాల కోసం 500 ఎకరం (2.0 కి.మీ2)లను ప్రతిపాదించింది. విమానాశ్రయం పూర్తైన తర్వాత మొదటి ఏడు సంవత్సరాలలో విలువ ఆధారిత పన్నుల మినహాయింపు, లీజు అద్దెలను మినహాయించడం వంటి అదనపు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది.[2] వాణిజ్య వైమానిక కార్యకలాపాల కారణంగా సైనిక విమానాల కదలికలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనపై భారత వైమానిక దళం అభ్యంతరం తెలిపింది.[3]

2013 జూన్ లో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ 1,200-ఎకరం (4.9 కి.మీ2) సైట్ కోసం ఆమోదం ఇచ్చింది. అయితే, అవసరమైన అన్ని విమానాశ్రయ మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ మొత్తం 1,500 ఎకరాలు (6.1 కి.మీ2) కావాలని పేర్కొన్నది. విమానాశ్రయ నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.[4]

ఇతర వివరాలు

[మార్చు]
  1. 2015 మార్చి: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 150 కి.మీ. (93 మై.) లోపు కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై విధించిన ఆంక్షల కారణంగా నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు - పెట్టుబడి విభాగాన్ని కోరింది. విమానాశ్రయం తరువాత తేదీలో అభివృద్ధిని పరిగణించబడుతుంది.[5]
  2. 2016: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఖరారు చేసినపుడు నిజామాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం భూ సేకరణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపాడు. కానీ, కనీస వైమానిక దూరం 125 కి.మీ. (78 మై.)లో వరంగల్‌లో ఇప్పటికే ప్రతిపాదించిన మరొక విమానాశ్రయం ఉంది.[6] 2017లో ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణం కోసం 1,161 ఎకరాలు (4.70 కి.మీ2) స్థలాన్ని గుర్తించింది. [7]
  3. 2019 జూలై: నిజామాబాదు విమానాశ్రయం అభివృద్ధి కోసం భారత విమానాశ్రయాల సంస్థ సాంకేతిక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది.
  4. 2021 ఆగస్టు 4: నిజామాబాదు విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ చేపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. Chowdhury, Anirban (19 January 2008). "Andhra plans 8 small airports". Rediff India Abroad. Archived from the original on 3 మే 2008. Retrieved 2 September 2021.
  2. "Andhra to invite bids for 4 airports with new incentives". Mint. 2 October 2009. Archived from the original on 4 April 2021. Retrieved 2 September 2021.
  3. "Airports at Nizamabad, Ramagundam unlikely". The Times of India. 24 November 2009. Archived from the original on 9 September 2015. Retrieved 2 September 2021.
  4. P, Ram Mohan (7 June 2013). "More land required for airport at Jakranpally". The Hindu. Archived from the original on 26 February 2020. Retrieved 2 September 2021.
  5. Konde, Mahesh (26 March 2015). "Telangana govt to take up only three airports for now". The Times of India. Archived from the original on 26 February 2021. Retrieved 2 September 2021.
  6. L, Venkat Ram Reddy (26 February 2016). "Telangana govt finalise proposals for setting up new airports plan". Deccan Chronicle. Archived from the original on 3 March 2020. Retrieved 2 September 2021.
  7. "Telangana government to establish airport in Nizamabad district". Telangana Today. 27 October 2017. Archived from the original on 20 February 2020. Retrieved 2 September 2021.
  8. India, The Hans (2021-08-05). "AAI will take up airport in Nizamabad, Jyotiraditya Scindia assures Suresh Reddy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2 September 2021.