నిజామాబాదు వ్యవసాయ మార్కెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామాబాదు వ్యవసాయ మార్కెట్

నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, నిజామాబాదులో ఉంది. దాదాపు 67 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.

చరిత్ర[మార్చు]

1933లో నిజాం కాలంలో ఈ మార్కెట్ ప్రారంభించబడింది.[1] తెలంగాణ ప్రభుత్వ మార్కెటింగ్ విభాగం కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వహిస్తుంది.

మార్కెట్ వివరాలు[మార్చు]

వరి, మొక్కజొన్న, పసుపు, పప్పుధాన్యాలు, సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు, ఆమ్చూర్, ఉల్లిపాయలు, ఇతర పంటలు ఈ మార్కెట్లో లభిస్తాయి. భారతదేశంలోని మార్కెట్లలో ఇది పసుపుకు ప్రసిద్ది చెందింది.[2][3]

ఈ-నామ్ మార్కెట్[మార్చు]

ఇక్కడ ఎలక్ట్రానిక్ బరువు ప్రమాణాలను ఉపయోగించి ధాన్యపు బరువును నిర్ధారించడానికి జరుగుతుంది.[4] అందుకే 2016, ఏప్రిల్ 14న భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ప్రాజెక్ట్ (నామ్ ప్రాజెక్ట్) కోసం తెలంగాణలోని 40 మార్కెట్లలో ఒకటిగా మార్కెట్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పద్ధతిని ఈ-నామ్ అని పిలుస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయినా మధ్యవర్తులు లేకుండా ఈ మార్కెట్లోని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఈ-నామ్ ప్రాజెక్టుకు ముందు పసుపు రైతులు మంచిధర పొందడానికి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు వెళ్ళేవారు.

అవార్డులు[మార్చు]

2016లో ఈ మార్కెట్ దేశంలోని ఉత్తమ ఈ-నామ్ మార్కెట్ గా జాతీయ అవార్డు అందుకుంది.[5][6]

మూలాలు[మార్చు]

  1. 10.60 lakh quintal turmeric crop reaches Nizamabad market yard
  2. Turmeric farmers an unhappy lot - The Hindu
  3. As exports rise, turmeric price shoots up in nizamabad market yard- The New Indian Express
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (13 January 2015). "నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈ-బిడ్డింగ్‌ పైలట్‌ ప్రాజెక్టు". www.andhrajyothy.com. Archived from the original on 30 జూలై 2019. Retrieved 30 July 2019. Check date values in: |archivedate= (help)
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 April 2017). "నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు జాతీయ అవార్డు". www.ntnews.com. Archived from the original on 30 జూలై 2019. Retrieved 30 July 2019. Check date values in: |archivedate= (help)
  6. Nizamabad market yard bags national award - The Hindu