Jump to content

నిడసనమెట్టు కొండలరావు

వికీపీడియా నుండి
నిడసనమెట్ల కొండలరావు
జననం1892
మరణంఫిబ్రవరి 29, 1972
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

నిడసనమెట్ల కొండలరావు (1892 - ఫిబ్రవరి 29, 1972) తెలుగు, హిందీ రంగస్థల నటుడు. నాటకకళాశేఖర, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు.[1]

జననం

[మార్చు]

కొండలరావు 1892 లో రాజమండ్రి లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

18 ఏళ్ల వయసులోనే రాజమండ్రి లోని చింతామణి నాటక సమాజం వారు ప్రదర్శించే నాటకాల్లో అన్నిరకాల పాత్రలు పోషించాడు. గోదావరి మండల ప్రాంతంలో పాండవోద్యోగ విజయాలు నాటకం ఎక్కడ ప్రదర్శించినా భీముడు పాత్రను ఈయనే ధరించేవాడు. కొండలరావు సుమారు 36 తెలుగు నాటకాల్లో, 2 హిందీ నాటకాల్లో నటించాడు.

1913 నుండి 1921 వరకు చింతామణి నాటక సమాజం లో ముప్పిడి జగ్గరాజు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావుల సరసన వివిధ పాత్రలు ధరించడమేకాకుండా, 1922లో ముప్పిడి జగ్గరాజు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించాడు.


నటించిన పాత్రలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఈయన 1972, ఫిబ్రవరి 29 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.271.

ఇతర లంకెలు

[మార్చు]