అగ్ని (నిప్పు)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నిప్పు లేదా మంట (Fire) ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "నిప్పు లేదా మంట " అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం అయనీకరణం చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.
మానవ జీవితంలో నిప్పు స్థానం
[మార్చు]మానవ చరిత్రలో నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
రసాయన చర్య
[మార్చు]అగ్ని జ్వాల ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక పదార్ధాలు, ఆక్సిజన్, కావలసినంత వేడి. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.
అగ్నికి సాధారణమైన కారణాలు:
- విస్ఫోటం
- వండటానికి వాడే ఓవెన్, స్టౌ మొదలైనవి.
- అగ్గిపుల్ల
- తీవ్రమైన వేడిమి, సూర్యరశ్మి, బల్బులు.
- యంత్రాల నుంచి రాపిడి, వంటగ్యాస్.
అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము, ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.
అగ్నిని ఆర్పడానికి ఈ మూడు మూలపదార్ధాలని తొలగించడం ముఖ్యమైనది. అందరికీ తెలిసిన పద్ధతిలో అగ్ని మీద నీరు జల్లడం వల్ల అక్కడి వేడిని తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కార్బన్ డై ఆక్సైడ్ వాడడం వల్ల ఆక్సిజన్ ను తొలగిస్తున్నాము.
వర్గీకరణ
[మార్చు]అగ్ని రకాలు | యూరోపియన్ / ఆస్ట్రేలియన్ వర్గీకరణ | అమెరికా వర్గీకరణ |
---|---|---|
కర్రలు, గుడ్డలు, రబ్బరు, కాగితం, కొన్ని రకాల ప్లాస్టిక్ వంటి ఘనపదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి A | తరగతి A |
పెట్రోలు, కిరోసిన్, కొవ్వు, ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి B | తరగతి B |
మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హైడ్రోజన్ వంటి వాయు పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి C | |
సోడియం, పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని. | తరగతి D | తరగతి D |
A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, విద్యుత్ పరికరాలు, వైర్లు, ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని. | తరగతి E | తరగతి C |
వంటల్లో వాడే కొవ్వు, నూనె వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి F | తరగతి K |
ప్రస్తావన
[మార్చు]అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతని దిక్కు పూర్వదక్షిణము. భార్య స్వాహాదేవి. పట్టణం తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. ఇతఁడు అష్టవసువులలో ఒక్కఁడయి వసువుల కందఱకును రాజై ఉండును. అనలుఁడు అనియు ఇతనికి నామము ఉంది. కొందఱు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుఁడందురు. అతనినామము అభిమానాగ్ని. [కుమారస్వామి అగ్నిపుత్రుఁడని కొన్నిచోట్ల చెప్పఁబడి ఉంది.] చూ|| పార్వతి. కాశియందు విశ్వానరుఁడు అను ఋషికి ఇతఁడు కుమారుఁడై పుట్టినందున ఇతనికి వైశ్వానరుఁడు అను నామముకలదు. చూ|| అంగిరసుఁడు.
(త్రేతాగ్నులు = ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము. ఇవిక్రమముగా వేదికి పూర్వ, దక్షిణ, పశ్చిమదిక్కులందు ఉండును.)
(పంచాగ్నులు = పైమూడగ్నులును, సభ్యము, అవసధ్యము. కడపటి రెండును వేదికి ఈశాన్యదిక్కునందు ఉండును.)
ఇవి కూడా చూడండి
[మార్చు]- పంచాగ్నులు = పంచ + అగ్నులు గురించి చూడండి.
- అగ్ని ప్రమాదాలు
- అగ్నిపర్వతం
- అగ్నిహోత్రం
- అగ్ని (దేవుడు)
- అగ్ని భద్రత