నీతా అశోక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీతా అశోక్
జననం
నీతా అశోక్ హెర్లే

(1991-02-01) 1991 ఫిబ్రవరి 1 (వయసు 33)[1]
కోట, ఉడిపి జిల్లా, కర్ణాటక, భారతదేశం
విద్యఎంబిఎ ఫైనాన్స్
వృత్తి
  • సినిమా నటి
  • టెలివిజన్ నటి
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం
తల్లిదండ్రులుఅశోక్ హెర్లే (తండ్రి), గీతా హెర్లే (తల్లి)

నీతా అశోక్, ప్రధానంగా కన్నడ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి.[2] ఆమె తుళు చిత్రం 'జబరదస్త్ శంకర' (2019) తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. కన్నడలో తొలిసారిగా నటించిన విక్రాంత్ రోనా (2022)తో ఆమె గుర్తింపు పొందింది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

కర్ణాటక ఉడిపి జిల్లాకు చెందిన గ్రామం కోట అనే తీరప్రాంత గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో నీతా అశోక్ జన్మించింది. ఆమె ఢిల్లీ, మంగళూరు, బెంగళూరులలో నివసించింది.[4][5] ఆమె తండ్రి అశోక్ హెర్లే, ఒక బ్యాంకర్, తల్లి గీతా అశోక్ హెర్లె. ఆమె తనను తాను శివరామ్ కారంత్ మనుమరాలు అని చెప్పుకుంటుంది.

కెరీర్

[మార్చు]

యశోధ, నా నిన్నా బిదాలారే, నీలాంబరి వంటి మూడు కన్నడ టెలివిజన్ సీరియల్స్ లతో పాటు దూరదర్శన్ లో ఒక హిందీ సీరియల్ లో కూడా ఆమె నటించింది. దేవదాస్ కాపికాడ్ దర్శకత్వం వహించిన తన పాఠశాల సీనియర్ అర్జున్ కాపికాడ్ నటించిన తుళు చిత్రం జబర్దస్త్ శంకరతో ఆమె చలన చిత్ర ప్రవేశం చేసింది.[5][6] కలర్స్ కన్నడ పార్టీలో సుదీప్ కలిసిన తర్వాత ఆమె విక్రాంత్ రోనా (2022) చిత్రంతో కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టింది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక  మూలం
2019 జబర్దస్త్ శంకర లావణ్య తుళు [5]
2022 విక్రాంత్ రోణా అపర్ణ బల్లాల్ "పన్నా" కన్నడ [7][8]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర భాష మూలం
2014 యశోద యశోద కన్నడ
2016 నా నిన్నా బిదాలారే నందిని కన్నడ
ఆశియన్ హిందీ
2018 నీలాంబరి కన్నడ

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం  మూలం
2023 11వ దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ తొలి నటి - కన్నడ విక్రాంత్ రోణా విజేత [9]

మూలాలు

[మార్చు]
  1. "Happy birthady to Neetha Ashok of #VikrantRona fame". Bangalore Times Twitter. Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. "Serial actors perform at Chitradurga". The Times of India. 14 October 2018. Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. A. Sharadhaa (21 July 2022). "Debuting with Vikrant Rona is like getting golden gift: Neetha Ashok". The New Indian Express. Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. "ವಿಕ್ರಾಂತ್ ರೋಣ ಸಿನಿಮಾಗೆ ನೀತಾ ಅಶೋಕ್ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿದ್ದು ಹೇಗೆ?". YouTube. 27 February 2021. Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  5. 5.0 5.1 5.2 KM Sathish Bellanki (8 November 2019). "ನೀತಾ ನಟನಾ ವೈಖರಿ". Prajavani (in కన్నడ). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  6. 6.0 6.1 A. Sharadhaa (13 February 2021). "Neetha Ashok: I am just lucky". Cinema Express. Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  7. "Actress Neetha Ashok's look from Phantom revealed". The Times of India. Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  8. "Chittara Star Awards". awards.chittaranews.com.
  9. "SIIMA Awards 2023: RRR, 777 Charlie win big; Jr NTR, Yash named Best Actors; Sreeleela and Srinidhi Shetty are Best Actresses". Indian Express. Retrieved 2023-09-15.