Jump to content

నీలేష్ రాణే

వికీపీడియా నుండి
నీలేష్ నారాయణ్ రాణే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
నవంబర్ 23
ముందు వైభవ్ నాయక్
నియోజకవర్గం కుడాల్

పదవీ కాలం
2009 - 2014
తరువాత వినాయక్ రౌత్
నియోజకవర్గం రత్నగిరి-సింధుదుర్గ్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-03-17) 1981 మార్చి 17 (వయసు 43)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (2024-ప్రస్తుతం)
తల్లిదండ్రులు నారాయణ్ రాణే, నీలిమ
జీవిత భాగస్వామి
ప్రియాంక రాణే
(m. 2007)
బంధువులు నితేష్ రాణే (సోదరుడు)
సంతానం అభిరాజ్ రాణే
నివాసం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

నీలేష్ నారాయణ్ రాణే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 ఎన్నికలలో కుడాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నీలేష్ రాణే తన తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి & మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009 లో‍క్‍సభ ఎన్నికలలో రత్నగిరి-సింధుదుర్గ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సురేష్ ప్రభుపై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 లో‍క్‍సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి వినాయక్ రౌత్ చేతిలో1,50,051 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2017లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.

నీలేష్ రాణే 2019లో 2019 లో‍క్‍సభ ఎన్నికలలో రత్నగిరి-సింధుదుర్గ్ నుండి 2018లో తన తండ్రి స్థాపించిన మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి అనంతరం అక్టోబర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] నీలేష్ నారాయణ్ రాణే 2024 ఎన్నికలకు ముందు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరి,[3][4] కుడాల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి వైభవ్ నాయక్ పై 8176 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. "Maharashtra Election 2019, Narayan Rane" (in ఇంగ్లీష్). 3 October 2019. Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.
  3. The Times of India (24 October 2024). "Nilesh Rane, son of ex-CM Narayan Rane, joins Shiv Sena ahead of Maharashtra polls". Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.
  4. The Hindu (23 October 2024). "Maharashtra Assembly elections: Nilesh Rane moves to Sena as open season begins in the state" (in Indian English). Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.
  5. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Kudal". Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.