నీలోఫర్ హాస్పిటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలోఫర్ హాస్పిటల్
తెలంగాణ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంరెడ్ హిల్స్‌, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
వ్యవస్థ
[యూనివర్సిటీ అనుబంధంకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
Services
అత్యవసర విభాగంఅవును
పడకలు500
చరిత్ర
ప్రారంభమైనది1953

నీలోఫర్ హాస్పిటల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని చారిత్రాత్మక హైదరాబాదు నగరం మధ్యలో ఉన్న హాస్పిటల్.[1] యువరాణి నీలోఫర్ 1949లో నీలోఫర్ అనే సంస్థను స్థాపించింది. ఒట్టోమన్ సామ్రాజ్యం (టర్కీ) రాజు కుమార్తెన నీలోఫర్ ను 1931లో హైదరాబాదు రాజ్య 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు (చివరి అసఫ్ జాహి పాలకుడు) ప్రిన్స్ మొజాంజాహి వివాహం చేసుకున్నాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మాదిరిగానే, నీలోఫర్ కు కూడా పేదలకు సేవ చేయటానికి ఇష్టం ఉండడంతో, నర్సుగా సేవ చేసింది.[2]

చరిత్ర

[మార్చు]
యువరాణి నీలోఫర్

1949 సంవత్సరంలో ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో యువరాణి నీలోఫర్ పనిమనిషి మరణించింది. ఆ విషయం తెలుసుకున్న యువరాణి, ఇకమీదట ఏ తల్లి మరణించకుండా చూసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల తలెత్తే సమస్యల గురించి నీలోఫర్, తన మామ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు తెలియజేసింది.[2]

ఆ రోజుల్లో ప్రసవాలు ఎక్కువగా ఇంట్లో జరిగేవి, దాంతో సాధారణ సమస్యలు రావడంతోపాటు తల్లి లేదా బిడ్డకు ప్రాణాంతకం ఉంటుంది. హెచ్ఇహెచ్ ది నిజాం ఛారిటబుల్ ట్రస్టు సభ్యుడు మీర్ నజాఫ్ అలీ ఖాన్, ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు యువరాణి “ఇక రాఫాత్లు చనిపోరు” అని ఉటంకించారు. ఫలితంగా హైదరాబాదు నగరంలోని రెడ్ హిల్స్‌ ప్రాంతంలో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నీలౌఫర్ హాస్పిటల్ ముఖ్యంగా ప్రసూతి విభాగం క్లిష్టమైన వైద్య సేవల కోసం ఉద్దేశించబడింది.[3]

1953లో తల్లి, బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభించబడింది. అధునాతన ప్రసూతి, శిశువైద్య శస్త్రచికిత్సలతో రోగనిర్ధారణ సదుపాయాలతో 500 పడకలకు పెంచింది.

2003లో జన్మించిన కవల పిల్లలు వీణ, వాణిలు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.[4][5]

వివాదం

[మార్చు]

2018లో ఈ ఆసుపత్రిలో పసిబిడ్డ మరణించడంతో, హిమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ ఉన్న పసిపిల్లలకు రక్త మార్పిడి చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం చూపించిందని ఆరోపణలు వచ్చాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. "Niloufer Hospital". nilouferhospital.in. Retrieved 2021-02-08.
  2. 2.0 2.1 "Niloufer pioneered maternity, child care". deccanchronicle. Jan 4, 2018. Retrieved 2021-02-08.
  3. "Hyderabad Shaan – History of Niloufer Hospital". www.v6news.tv. Retrieved 2021-02-08.[permanent dead link]
  4. P.s, Rohit (2016-06-28). "Veena-Vani complete 10 years at Niloufer". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-08.
  5. Henry, Nikhila (2018-10-16). "Happy birthday twice over for Hyderabad's conjoined twins". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-08.
  6. P.s, Rohit (2018-05-15). "Niloufer Hospital accused of negligence". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-08.

ఇతర లంకెలు

[మార్చు]