Jump to content

నుమాయిష్ 2025

వికీపీడియా నుండి
నుమాయిష్ 2025
ప్రక్రియస్టేట్ ఫెయిర్
తేదీలు3 జనవరి - 15 ఫిబ్రవరి
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు1938 - ప్రస్తుతం
వెబ్‌సైటు
[1]

నుమాయిష్‌ 2025 (84వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌, హైదరాబాదులో జనవరి 3 నుండి ఫిబ్రవరి 15 వరకు 44 రోజుల పాటు జరగనుంది. 2500 స్టాళ్లతో ఏర్పాటు చేసిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను 2024 జనవరి 3న ప్రారంభమైంది. నుమాయిష్‌కు సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీభవన్, గోషామహల్ గేట్‌లను, అజంతా, అందుబాటులో ఉంచింది.

నుమాయిష్‌ షెడ్యూల్‌ ప్రకారం జనవరి 1వ తేదీన ప్రారంభమై 46 రోజుల పాటు ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా పడింది.[1][2][3]

ప్రారంభం

[మార్చు]

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 2024 నుమాయిష్‌ను ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌ మెట్టు సాయి కుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్‌, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్‌, కోశాధికారి డాక్టర్‌ ప్రభాశంకర్‌ పాల్గొన్నారు.[4][5][6][7]

ప్రవేశం రుసుము & సమయం

[మార్చు]

నుమాయిష్‌ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.50గా ఉంది.[8] సాధారణ రోజుల్లో రోజూ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 10.30 వరకూ ఉంటుంది. శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది.[9] 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ మధ్యలో టాయ్ ట్రైన్ ప్రతీ అరగంటకోసారి ఓ రౌండ్ వేస్తుంది. టాయ్ ట్రైన్‌ ఎక్కాలనుకుంటే దానికి టికెట్‌ని ట్రైన్ దగ్గరే కొనుక్కోవచ్చు.

ట్రాఫిక్‌ మళ్లింపు

[మార్చు]
  1. సిద్దంబర్‌బజార్‌ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్‌ వద్ద అబిడ్స్‌ వైపు మళ్లించారు.[10]
  2. బషీర్‌బాగ్‌, కంట్రోల్‌ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద బీజేఆర్‌ విగ్రహం, అబిడ్స్‌ వైపు మళ్లించారు.
  3. బేగంబజార్‌, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ వద్ద దారుసలాం, ఏక్‌మినార్‌ వైపు మళ్లించారు.
  4. దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజ్‌ వైపు మళ్లించారు.
  5. మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ రూట్‌లో మళ్లించారు.

మూలాలు

[మార్చు]
  1. "నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే." TV9 Telugu. 29 December 2024. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  2. "హైదరాబాదీలకు అలెర్ట్‌.. నుమాయిష్‌ తేదీలు వాయిదా, మళ్లీ ఎప్పుడు ప్రారంభమంటే?". Zee News Telugu. 30 December 2024. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  3. "నుమాయిష్‌ ప్రారంభం వాయిదా". NT News. 29 December 2024. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  4. "నుమాయిష్‌ షురూ.. పాల్గొన్న మంత్రులు". NTV Telugu. 3 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  5. "భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!". 3 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  6. "నాంపల్లిలో మొదలైన 'నుమాయిష్‌' సందడి". 3 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  7. "45-day long Hyderabad's Numaish inaugurated, separate stalls for women entrepreneurs to be allotted" (in Indian English). The Hindu. 4 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  8. "నుమాయిష్-2025 ప్రారంభం.. ఎగ్జిబిషన్ టైమింగ్స్, టికెట్ ధరలు, పూర్తి వివరాలు ఇవే." Times Now Telugu. 4 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.
  9. V6 Velugu (3 January 2025). "హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ షురూ అయ్యింది". Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఇలా వెళ్తున్నారా.. మీరు ఇరుక్కున్నట్లే." Andhrajyothy. 3 January 2025. Archived from the original on 6 January 2025. Retrieved 6 January 2025.