నూతక్కి సుబ్బారావు
స్వరూపం
నూతక్కి సుబ్బారావు ప్రముఖ రంగస్థల నటులు.
జననం
[మార్చు]సుబ్బారావు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా యడ్లపల్లి లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు లక్ష్మీకాంతయ్య, ఈశ్వరమ్మ.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]సుబ్బారావు తండ్రిగారైన ఈశ్వరయ్య ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు పాడేవారు. తండ్రితోపాటు రామాయణ కీర్తనలు పాడిన సుబ్బారావుకు రంగస్థలంపై నటించడం సులభం అయింది.
అబ్బూరి వరప్రసాదరావు, ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, అద్దంకి శ్రీరామమూర్తి, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, పూర్ణిమ, సత్యవతి, రామమోహనరావు చౌదరి, పువ్వుల సూరిబాబు, మాధవపెద్ది సత్యం వంటి నటులతో కలిసి నటించారు.
వీరికి ప్రముఖ హార్మోనిష్టులైన మారుతి సీతారామయ్య, కడియాల అంజయ్య, విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు, ఏకాక్షరలింగం, పురుషోత్తంలు సహకరించారు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- కురుక్షేత్రం - అభిమన్యుడు, వికర్ణుడు
- బాలనాగమ్మ - బాలవర్ధుడు
- హరిశ్చంద్ర - నక్షత్రకుడు
- రామంజనేయ యుద్ధం - అంగదుడు, శతృజ్ఞుడు, నారదుడు
సన్మానాలు - సత్కారాలు
[మార్చు]- సువర్ణ ఘంటా కంకణం (చీరాల)
- సువర్ణ పతకం (కొల్లూరు)
- సువర్ణ అంగుళీకం (దాచేపల్లి)
మూలాలు
[మార్చు]- నూతక్కి సుబ్బారావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 292.