నేనావ‌త్ బాలు నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనావ‌త్ బాలు నాయక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు రమావత్‌ రవీంద్ర కుమార్‌
తరువాత రమావత్‌ రవీంద్ర కుమార్‌
నియోజకవర్గం దేవరకొండ

నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్
పదవీ కాలం
2014 - 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1973
ముదిగొండ గ్రామం, దేవరకొండ మండలం. నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి

నేనావ‌త్ బాలు నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

నేనావ‌త్ బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి రమావత్‌ రవీంద్ర కుమార్‌ పై 7468 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన జెడ్పిటీసీగా పోటీ చేసి నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

బాలు నాయక్ 2014 డిసెంబర్ 30న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు.[3] ఆయన 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రమావత్‌ రవీంద్ర కుమార్‌ చేతిలో 38,848 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 27న కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను దేవరకొండ అభ్యర్థిగా[4] పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ పై 30017 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై[5], 2023 డిసెంబర్ 16న ప్యానెల్ స్పీకర్‌గా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (28 October 2023). "ముగ్గురు ఖరారు." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Eenadu (20 November 2023). "మరో విజయానికి తహతహ". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
  3. The New Indian Express (30 December 2014). "Nalgonda Zilla Parishad Chairman Balu Nayak Joins TRS". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  4. Sakshi (27 October 2023). "కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. Namaste Telangana (16 December 2023). "ప్యానల్‌ స్పీకర్లుగా ప్రకాశ్‌రెడ్డి, బాలూ నాయక్‌." Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  7. TV9 Telugu (16 December 2023). "ప్యానెల్ స్పీక‌ర్లు స‌భ‌కు ఎప్పుడు అధ్యక్షత వ‌హిస్తారు? వారికి ఉండే అర్హతలు ఏంటీ..?". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)