రమావత్ రవీంద్ర కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమావత్‌ రవీంద్ర కుమార్‌
రమావత్ రవీంద్ర కుమార్


పదవీ కాలం
2004 - 2009, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం దేవరకొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1972, జూన్ 1
రాథ్యా నాయక్ తండా, సేరేపల్లి గ్రామం, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కనిలాల్, జానకమ్మ
జీవిత భాగస్వామి శ్యామల
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

రమావత్‌ రవీంద్ర కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున దేవరకొండ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య[మార్చు]

రవీంద్ర కుమార్ 1972, జూన్ 1న కనిలాల్, జానకమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, సేరేపల్లి గ్రామం సమీపంలోని రాథ్యా నాయక్ తండాలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1998లో పొలిటికల్ సైన్స్ నుండి ఎంఏ డిగ్రీ, 2002లో ఎల్.ఎల్.బి. పూర్తి చేసాడు.[3] న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రవీంద్ర కుమార్ కు శ్యామలతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

సిపిఐ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రవీంద్ర కుమార్ దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా 1995లో, 2002లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. శక్రునాయక్ పై 17,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ చేతిలో 7,468 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సి.పి.ఐ. పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భిలియా నాయక్ పై 4216 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ నుండి ఏకైక ఎమ్మెల్యే అయిన రవీంద్ర నాయక్, తెలంగాణ అసెంబ్లీ సిపిఐ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నాడు.[4] తరువాత టిఆర్ఎప్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ పై 38,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[6] రమావత్‌ రవీంద్ర కుమార్‌ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7][8]

ఇతర వివరాలు[మార్చు]

చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెనిజులా మొదలైన దేశాలను సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Ravindra Kumar Ramavath(Communist Party of India(CPI)):Constituency- DEVARAKONDA (ఎస్.టి)(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-23.
  2. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-23.
  3. Reporter, Staff (2014-05-19). "They come from diverse backgrounds". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-23.
  4. "Ramavath Ravindra Kumar | MLA | Rathya Thanda | Devarakonda | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-19. Retrieved 2021-08-23.
  5. "Devarakonda (ఎస్.టి) Election Result 2018: Devarakonda (ఎస్.టి) Assembly Election 2018 Results | Devarakonda (ఎస్.టి) Vidhan Sabha MLA Result". wap.business-standard.com. Retrieved 2021-08-23.
  6. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  8. Eenadu (27 January 2022). "తెరాస జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రకుమార్‌". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.