నే నిన్ను మరువలేను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నే నిన్ను మరువలేను
(1979 తెలుగు సినిమా)
Ne ninnu maruvalenu.jpg
దర్శకత్వం విజయ్
నిర్మాణం జి.బి.బండారి,
కె.వెంకటేష్ దత్
తారాగణం రాజ్‌కుమార్,
లక్ష్మి
నిర్మాణ సంస్థ కళాకృతి
భాష తెలుగు

నే నిన్ను మరువలేను కన్నడ సినిమా "ನಾ ನಿನ್ನ ಮರೆಯಲಾರೆ"కు తెలుగు డబ్బింగ్ సినిమా. కళాకృతి బ్యానర్ పై ఈ సినిమా 1979లో విడుదలయ్యింది. ఈ సినిమా ఎ.ఆర్.ఆనంద్ వ్రాసిన కన్నడ నవల "నాను నీను జోడి" ఆధారంగా చిత్రీకరించబడింది. ఈ సినిమా తమిళభాషలో రజనీకాంత్ హీరోగా "పుత్తు కవితై" అనే పేరుతో, హిందీలో అనిల్ కపూర్ హీరోగా "ప్యార్ కియా హై ప్యార్ కరేంగే" అనే పేరుతో రీమేక్ చేయబడింది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

కథ[మార్చు]

ఉష సంపన్నురాలు. తండ్రిలేని పిల్ల. తల్లి అదుపు ఆజ్ఞలలో పెరుగుతుంటుంది. మోటారు సైకిలు పందాలలో గెలుపొందిన ఆనంద్ అనే సామాన్య స్థితిగల యువకుని ప్రేమిస్తుంది. అయితే ఉష తల్లి దృష్టిలో ఆస్తి అంతస్తులు అడ్డువస్తాయి. ఆమె ఈ ప్రేమ వ్యవహారాన్ని ఆమోదించ లేకపోయింది. కుమార్తెకు వేరే సంబంధం నిశ్చయిస్తుంది. ముహూర్తం నిర్ణయించారు. ఆనంద్ ఉషను కాపాడాలని ఎంత ప్రయత్నించినా వివాహానికి ముందుగా రాలేకపోయాడు. ఉషను కలుసుకోలేక పోయాడు. ఉష వివాహం అయిపోయిందని తెలుసుకున్న ఆనంద్ అవివాహితుడిగా వుండిపోయాడు. విధి వక్రించింది. ఉష వివాహం మూడునాళ్ల ముచ్చట అయింది. ప్రమాదంలో భర్త మరణించాడు. పసుపు కుంకుమ కరువైనాయి. కొద్ది రోజుల తరువాత అనుకోకుండా ఉష, ఆనంద్ కలుసుకుంటారు. వారు ఒకరి పరిస్థితి ఒకరు తెలుసుకుంటారు. వారు ఎలాంటి నిర్ణయాలకు రాగలిగారన్నది పతాక సన్నివేశం[1].

పాటలు[మార్చు]

  1. అందాలనే రువ్వే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. చిన్నారి ఊహలే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. చిన్ని ముద్దు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. నిన్ను మరువలేను - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. లక్కరాజు (5 June 1979). "చిత్రసమీక్ష నే నిన్ను మరువలేను". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 64. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 20 December 2017.

బయటిలింకులు[మార్చు]