నైజీరియాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవనాగరిలో "ఓం" గుర్తు

నైజీరియాలో హిందూ మతం ప్రధానంగా భారతదేశం నుండి హిందువుల రాక ద్వారా, హరే కృష్ణ మార్గం ద్వారా వ్యాపించింది. పంతొమ్మిదవ శతాబ్దపు తొలిభాగంలో నైజీరియాకు వచ్చిన మొదటివారు సింధీలు. ప్రారంభంలో, వారు ప్రధానంగా వ్యాపారంలో నిమగ్నమై ఉండేవారు. క్రమంగా, వ్యాపారంలో ఆసక్తిని నిలుపుకుంటూనే వారు, తయారీ, వృత్తిపరమైన సేవల వంటి ఇతర రంగాలలోకి ప్రవేశించారు. తరువాతి దశాబ్దాలలో, వారు US$4 బిలియన్లకు పైగానే పెట్టుబడులు పెట్టారు. చెల్లారం, భోజ్‌సన్, చంద్రాయ్ మొదలైన సింధీ పేర్లు నైజీరియాలో ప్రసిద్ధి చెందాయి. [1] భారతీయ సింధీలు సూపర్‌స్టోర్‌లను నడుపుతున్నారు. టెక్స్‌టైల్స్ రంగం, అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫిషింగ్, ఇంజనీరింగ్ పరిశ్రమలలో వెలుగొందుతున్నారు.

భారతీయ మూలానికి చెందిన హిందువులు[మార్చు]

భారతదేశం, నైజీరియా రెండూ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఆఫ్రికాలో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడానికి బ్రిటిష్ వారు భారతీయులను ఆఫ్రికాకు తీసుకువచ్చారు. అయితే, నైజీరియా అంతర్యుద్ధం సమయంలో చాలా మంది భారతీయ జనాభా, సామ్రాజ్యం అంతటా ఉన్న ఇతర విదేశీయులతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ లకో, లేదా తిరిగి భారతదేశానికో వెళ్ళిపోయారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న భారతదేశం నేడు నైజీరియాలో USD 15 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది. నైజీరియాలో వ్యాపారాన్ని స్థాపించిన 85కి పైగా ప్రసిద్ధ భారతీయ సంస్థలు నైజీరియన్లకు ఉద్యోగావకాశాలను కలిగిస్తున్నాయి. అబుజాలోని భారత హైకమిషన్ ప్రకారం నైజీరియాలో 35,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

1970ల నుండి నైజీరియా ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు భారతీయ వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులను నియమించుకుంటున్నాయి. 1980ల చివరలో, దేశపు చమురు ఆదాయాలలో గణనీయంగా తగ్గిపోవడంతో, దేశం తీవ్రమైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, పేదరికాన్ని ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు, అనేకమంది భారతీయ నిపుణులు భారతదేశానికి తిరిగి వచ్చారు.

నైజీరియా ప్రభుత్వం దేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులకు పౌరసత్వం మంజూరు చేయడంలో ఉదారతను, వివక్షత లేని విధానాన్నీ అనుసరిస్తుంది. భారతీయ సంతతికి చెందిన 8,000 మంది నైజీరియన్లు దేశంలో నివసిస్తున్నారు. ప్రవాసులతో కలిపి మొత్తం 25,000 మంది హిందువులు నైజీరియాలో నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది లాగోస్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. [2]


బాలాజీ ఆలయం, లాగోస్

నైజీరియా మూలానికి చెందిన హిందువులు[మార్చు]

ప్రధానంగా ఇస్కాన్ ప్రయత్నాల కారణంగా కొంతమంది స్థానిక నైజీరియన్లు హిందూ మతంలోకి మారారు. చాలా మంది నైజీరియన్ హిందువులు లాగోస్ (ఇకోరోడు, షోమోలు, అలిమోషో, విక్టోరియా ద్వీపం)లో ఉన్నప్పటికీ, ఇబాడాన్‌లో కూడా కొందరు ఉన్నారు (ఇక్కడ శ్రీ సత్యసాయి సేవా (సేవ) సంస్థ 1972లో స్థాపించబడింది) [3]

లాగోస్‌లోని అపాపాలో వేద సంక్షేమ సముదాయాన్ని ఇస్కాన్ ప్రారంభించింది. [4]

సత్యసాయి సేవా సంస్థ[మార్చు]

శ్రీ సత్యసాయి సేవా (సేవ) సంస్థ 1972లో సత్యసాయి బాబా మిషన్‌ను ఒక పబ్లిక్, ఛారిటబుల్ ట్రస్ట్‌గా స్థాపించారు; ఉచితంగా తాగునీరు, వైద్యం, విద్య అందిస్తోంది.  ఇబాడాన్‌లో శ్రీ సత్యసాయి బాబా సెంటర్ పేరుతో కేంద్ర సమావేశ స్థలం నిర్మించబడింది. లాభాపేక్షలేని ఆధ్యాత్మిక సంస్థగా నమోదు చేయబడింది. వివిధ దాతల నిధులతో ఈ స్థలాన్ని 99 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. లాగోస్‌లో, విక్టోరియా ద్వీపంలోని ఒక ప్రైవేట్ ఇంట్లో సాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. [5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు [మార్చు]

  1. Kenyans247. "Hinduism in Nigeria - Kenyans247". www.kenyans247.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-22. Retrieved 2020-01-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NRI Archived 2012-02-06 at the Wayback Machine
  3. "The Untold Story of the Nigerian Hindus, These Are The Most Interesting Things You Never Knew About Them And Their Fascinating Religion". Online Nigeria. July 22, 2017. Archived from the original on 2018-09-19. Retrieved 2021-12-31.
  4. "Day Hare Krishna Came to Town". WorldWide Religious News. Archived from the original on 5 October 2008. Retrieved 15 May 2015.
  5. "Sri Sathya Sai International Organization | Sri Sathya Sai International Organization". www.sathyasai.org. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.