Jump to content

నైలు నది

వికీపీడియా నుండి
(నైలు నుండి దారిమార్పు చెందింది)
కాంపోజిట్ కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి నైలునది డెల్టా ప్రాంతం)

నైలు నది : (ఆంగ్లం : Nile) (అరబ్బీ భాష : النيل " అల్-నీల్"), ఆఫ్రికాలో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నది.[1].కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగా అమెజాన్ నది పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.[2] దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ సూడాన్ రాజధానియైన ఖార్టూమ్ దగ్గర కలుస్తాయి.

నది ఉత్తర భాగం సుడాన్ నుంచి ఈజిప్ట్ వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉంది. ఈజిప్టు జనాభాలో సముద్ర తీర ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది మధ్యధరా సముద్రంలో కలిసే చోట పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. ఈజిప్టును "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వరప్రసాదంగా చెబుతారు.

దృశ్యమాలిక

[మార్చు]

మీడియా

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నైలు_నది&oldid=4336576" నుండి వెలికితీశారు